మోక్షాసిటీ గ్రాండ్ హోటల్‌లో అగ్ని ప్రమాదం

  అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో తప్పిన ముప్పు.. ప్రాణహాని, ఆస్తినష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు ఎంజిఎం : వరంగల్ నగరంలోని ప్రముఖ మోక్ష సిటీ గ్రాండ హోటల్ మొదటి అంతస్తులోని వంటగదిలో ఉన్న తందురి బట్టిలోంచి మంటలు చెలరేగడం కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సహాయ చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌లోని ములుగురోడ్డు సమీపాన ఉన్న మోక్ష సిటిగ్రాండ్ హోటల్ మొదటి అంతస్తులో రెస్టారెంట్‌పైన వివిధ అంతస్తుల్లో […] The post మోక్షాసిటీ గ్రాండ్ హోటల్‌లో అగ్ని ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో తప్పిన ముప్పు..
ప్రాణహాని, ఆస్తినష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు

ఎంజిఎం : వరంగల్ నగరంలోని ప్రముఖ మోక్ష సిటీ గ్రాండ హోటల్ మొదటి అంతస్తులోని వంటగదిలో ఉన్న తందురి బట్టిలోంచి మంటలు చెలరేగడం కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సహాయ చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌లోని ములుగురోడ్డు సమీపాన ఉన్న మోక్ష సిటిగ్రాండ్ హోటల్ మొదటి అంతస్తులో రెస్టారెంట్‌పైన వివిధ అంతస్తుల్లో బార్, రెస్టారెంట్, లాడ్జి మినీ ఫంక్షన్‌హాల్ నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం మొదటి అంతస్తులోని వంటగదిలో తందురి బట్టిలోంచి మంటలు చెలరేగడంతో దీనిపై ఉన్న ఆయిల్ పదార్థాల సంబంధిత గాలిని బయటికి పంపించే గొట్టుములో డస్ట్ పేరుకుపోవడంతో మంటలు ఈ గొట్టములోకి స్టర్క్ అవడం కారణంగా మంటలు చెలరేగి గొట్టములో నుండి పై అంతస్తు వరకు పొగలతో ఒకవైపు గొట్టుములో మంటలతో హోటల్ అంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి.

దీంతో హోటల్లో భోజనం చేస్తున్న వారు లాడ్జి రూముల్లో ఉన్నవారు ప్రాణభయంతో కిందికి పరుగులు తీశారు. వెంటనే స్థానికులు, యాజమాన్యం, పోలీసులకు అగ్నిమాపక అధికారులకు సమాచారంఅందించారు. హన్మకొండ, వరంగల్ అగ్నిమాపక అధికారుల సిబ్బందితో ఉమ్మడి జిల్లా అగ్నిమాపక అధికారి మామిడి భగవాన్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మొత్తానికి మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగుతున్న సమయంలో ఆస్తినష్టం, ప్రాణనష్టం ఏం జరగకపోవడంతో రోడ్డు పక్కన స్థానికులు, పక్కనే ఉన్న ఆస్పత్రి, స్థానికులు, యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.

Fire at the Moxacity Grand Hotel

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మోక్షాసిటీ గ్రాండ్ హోటల్‌లో అగ్ని ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: