వినాయక వ్రత కథ

వినాయక చవితి కథ ప్రారంభానికి ముందు పూజలో పాల్గొంటున్న వారంతా అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరు కథ చదువుతుండగా, మిగిలిన వారు శ్రద్ధగా ఆలకించాలి. కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలు వినాయకునిపై వేసి, కొన్ని మన తలపై వేసుకోవాలి. కథ మధ్యలో లేవకూడదు. ఆసాంతం వినాలి.   ఓ రోజు నైమిశారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని, సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం ఆయన శౌనకుడు, ఇతరులకు వి నాయకుడి పుట్టుక, […] The post వినాయక వ్రత కథ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వినాయక చవితి కథ ప్రారంభానికి ముందు పూజలో పాల్గొంటున్న వారంతా అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరు కథ చదువుతుండగా, మిగిలిన వారు శ్రద్ధగా ఆలకించాలి. కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలు వినాయకునిపై వేసి, కొన్ని మన తలపై వేసుకోవాలి. కథ మధ్యలో లేవకూడదు. ఆసాంతం వినాలి.

 

ఓ రోజు నైమిశారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని, సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం ఆయన శౌనకుడు, ఇతరులకు వి నాయకుడి పుట్టుక, చంద్రుణ్ని దర్శిస్తే వచ్చే దోషం, దాని నివారణ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. దానికి గజాసురుడు “స్వామీ! నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని నా కోరిక” అని కోరాడు. భక్తులకి తేలికగా ప్రత్యక్షమై, వారి కోరికలని ఇట్లే తీర్చి తన మీదకి తెచ్చుకొనే స్వభావంగలవాడు శివుడు. ఇంకేం శివుడు గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి హాయిగా నివశించసాగాడు.

అక్కడ కైలాసంతో పార్వతీదేవి తన భర్త అయిన శివుడి జాడ తెలియక ఆయన కోసం అన్వేషిస్తూ, ఆయన గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంది. దానితో పార్వతి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ జరిగింది చెప్పింది. ఆయన సహాయం కోరింది. “ఓ మహానుభావా! పూర్వం భస్మాసురుడి నుంచి నువ్వు నా భర్తని రక్షించావు. అలాగే ఇప్పుడు నువ్వు గజాసురుడి బారి నుంచి కూడా ఆయన్ని విడిపించి రక్షించాలి”

అంటూ వేడుకుంది. శ్రీహరి ఆమెను ఊరడించి “శివుని వాహనమైన నందిని నా దగ్గరకు పంపు నీ కోరిక తీరుస్తాను. గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళమే తగినది” అని అభయమిచ్చాడు. బ్రహ్మ, ఇతర దేవతలందరినీ వెంటనే రావలసిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకు తలో వాయిద్యం ఇచ్చి, తనూ చిరుగంటలూ, సన్నాయిని అందుకు ని, వారందరితో గజాసురుడి దగ్గరికి వెళ్లాడు. ఆ ఊళ్లో మనోహరంగా సాగే ఆ గంగిరెద్దు మేళాన్ని గురించి విన్న గజాసురుడు దాన్ని స్వయంగా చూ సి ఎంతో వినోదించాడు. మేళం పెద్దయిన శ్రీహరి తో “నరుడా! నీకేం కావాలో కోరుకో” అన్నాడు. దానికి సమాధానంగా శ్రీహరి ఇలాగన్నాడు “అ య్యా! ఇది శివుడి వాహనమైన నంది. శివుని కోసం వచ్చింది.  కాబట్టి దానికి ఆయన్ని చూపించు. తర్వాత మా దారిన మేం వెళతాం” అది వినగానే గజాసురుడు ఉలిక్కిపడ్డాడు. తన పొట్టని చీల్చుకుని కానీ శివుడు బయటికి రాలేడు. వస్తే తనకు మరణం తప్పదు. దివ్యదృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకుని, ఇక తనకి చావు తప్పదని గ్రహించి తన కడుపులోని శివుణ్ని ఇలా కోరాడు.

“స్వామీ! నేను మరణించాక నా తలను మూడు లోకాలలో పూజించేలా చేయి. నా చర్మాన్ని నువ్వు ధరించు” శివుడు అందుకు అంగీకరించగానే, శ్రీహరి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసురుని కడుపు చీల్చి అతన్ని చంపేసింది. పొట్ట నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి చెప్పాడు. “పరమశివా! దుర్మార్గులకు ఇలాంటి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోయడంతో సమానం సుమా!” బ్రహ్మను, ఇతర దేవతలను, వారి వారి లోకాలకు పంపించేసిన శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్లిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు.

వినాయకుని జననం

భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారయింది. తన ఒంటి మీది సున్నిపిండిని నలిపి తీసి, ఆ నలుగుపిండితో ఓ చిన్నపిల్లవాడి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి చెప్పింది.
“కుమారా! నువ్వు కాపలా ఉండి, లోపలికి ఎవరినీ రానీయకు” ఆ బాలుడు అందుకు ఒప్పుకుని సింహద్వారం వద్దకు వెళ్లాడు. పార్వతి స్నానం ముగించుకుని, అనేక నగలను ధరించి, భర్త కోసం ఆత్రంగా వేచి చూడసాగింది. కైలాసం చేరుకున్న శివుడు లోపలకు వెళ్లబోతూంటే, పార్వతి కాపుంచిన పిల్లవాడు ఆయన్ని అడ్డగించాడు. శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలను తెగ్గోసి లోపలకు వెళ్లాడు. పార్వతి శివుడికి ఎదురెళ్లి, ఆహ్వానించి ఆయనకు కాళ్లు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్లిచ్చి పతివ్రతాధర్మం ప్రకారం పూజించింది.
చాలాకాలం తర్వాత కలుసుకున్న వారిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. వారి సంభాషణలో ద్వారం దగ్గరి బాలుడి ప్రసక్తి వచ్చింది. పార్వతి జరిగింది చెప్పగానే శివుడు విచారిస్తూ చెప్పాడు. “అయ్యో! నేను వాడి తల నరికేశానే?” ఇద్దరూ కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికిచ్చిన వరం గుర్తుకొచ్చి, ఆ గజాసురుడి తలను తెచ్చి, మరణించిన ఆ బాలుడికి అతికించి, ప్రాణం పోసి చెప్పాడు. “వత్సా! నీకు గజాననుడు అనే పేరు పెడుతున్నాను” పార్వతి గజాననుడిని ప్రేమగా పెంచుకోసాగింది.
గజాననుడు కూడా తన తల్లిదండ్రులతో ప్రేమగా మెలగుతూ పెరగసాగాడు. అనింద్యుడనే ఎలుకను తన వాహనంగా చేసుకుని దానిపై తిరగసాగాడు.
మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకు ఒక కొడుకు పుట్టాడు. అతడికి ‘కుమారస్వామి’ అనే పేరు పెట్టారు. మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వినాయక వ్రత కథ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.