‘ద్వాదశాదిత్య’గా ఖైరతాబాద్ గణేశుడు

గణేష్ నవరాత్రులు అనగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడే. దీనికి కారణం భారీ ఆకారం, విగ్రహం ఎత్తే. గతేడాది 57 అడుగులున్న ఖైరతబాద్ వినాయకుడు ఈసారి 61 అడుగులకు పెరిగాడు. ఈ ఏడాది వక్రతుండ మహాకాయుడుగా దర్శనమిస్తున్నాడు. ఆ గౌరీపుత్రుడి దర్శనభాగ్యం కోసం కొన్ని లక్షలమంది ఏకధాటిగా 11 రోజులపాటు ఖైరతాబాద్ కు పోటెత్తుతారు. భారీ ఆకారంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. 60 ఏళ్లుగా, […] The post ‘ద్వాదశాదిత్య’గా ఖైరతాబాద్ గణేశుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గణేష్ నవరాత్రులు అనగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడే. దీనికి కారణం భారీ ఆకారం, విగ్రహం ఎత్తే. గతేడాది 57 అడుగులున్న ఖైరతబాద్ వినాయకుడు ఈసారి 61 అడుగులకు పెరిగాడు. ఈ ఏడాది వక్రతుండ మహాకాయుడుగా దర్శనమిస్తున్నాడు. ఆ గౌరీపుత్రుడి దర్శనభాగ్యం కోసం కొన్ని లక్షలమంది ఏకధాటిగా 11 రోజులపాటు ఖైరతాబాద్ కు పోటెత్తుతారు. భారీ ఆకారంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. 60 ఏళ్లుగా, 60 రూపాల్లో దర్శనమిచ్చిన లంబోదరుడు ఈ సంవత్సరం ద్వాదశాదిత్య మహాగణపతిగా భక్తులను ఆశీర్వదించబోతున్నాడు.

12 తలలు, ఏడు అశ్వా లు, 12 సర్పాలతో 61 అడుగుల ఎత్తులో సూర్యభగవానుడి రూపంలో కటాక్షించబోతున్నాడు. ఎందుకంటే ఈ ఏడాది ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ఆదిత్యుడు శాంతించాలని ద్వాదశాదిత్య రూపాన్ని తీసుకున్నారు. వినాయకుడికి ఎడమవైపున దత్రాత్రేయుడు, కామధేనువు సిద్ధకుంజికాదేవీ ఉంటారు. కుడివైపు ఏకాదశిదేవి, మహావిష్ణువు రూపం దర్శనమిస్తుంది. భారీ గణనాథుడి విగ్రహం తయారీకి సుమారు 150 మంది కళాకారులు పనిచేశారు. వాళ్లంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చిన వారెవరూ లాభాపేక్షతో కాకుండా భక్తితో, చిత్తశుద్ధితో పనిచేశారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేయాలనేది ప్రతీ కళాకారుడి స్వప్నం. ఆ అదృష్టం కలగాలని ప్రతీ ఆర్టిస్టూ కోరుకుంటారు. అలాంటి వారికి తప్పకుండా అవకాశం ఇస్తామంటున్నారు విగ్రహ నిర్వాహకులు స్తపతి రాజేంద్రన్.

గణేష్ విగ్రహం నెలకొల్పి 2013 నాటికి 59 ఏళ్లు అయ్యింది. దీంతో 2013లో 59 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారు చేశారు. 2014లో విగ్రహం ఎ త్తు 60 అడుగులకు చేరింది. గణనాథుడి విగ్రహం తరలింపు, నిమజ్జనం విషయంలో సమస్యలు రావడంతో.. విగ్రహం ఎత్తు తగ్గించాలని నిర్వాహకులు నిర్ణయించారు.

2018లో శ్రీ సప్త ముఖ గణేషుడి విగ్రహం ఎత్తు 55 అడుగులే. ఈ ఏడాది మాత్రం 61 అడుగుల ఎత్తుతో విగ్రహం తయారు చేశారు. 11 రోజులపాటు దేవుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి, ఊర్ల నుంచి భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గణనాథుడి నిమజ్జనం పెద్ద సంబురంగా జరుపుకోవడం తమ అదృష్టంగా భావిస్తారు నగరవాసులు. గణేశుడితోపాటు లడ్డూ కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకుంది.

khairatabad ganesh 2019

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘ద్వాదశాదిత్య’గా ఖైరతాబాద్ గణేశుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: