ఈ గణపతిని నిమజ్జనం చేయరు..!

ఏడాదికోసారి గణపతి నవరాత్రులొస్తాయి. రకరకాల ఆకృతుల్లో బోలెడు రంగుల్లో గణేషుడి బొమ్మలు దొరుకుతాయి. ఇంటికో బుజ్జి గణపతి కొలువుదీరితే మండపాన్ని బట్టి ఆకాశమెత్తున కొలువుదీరుతాయి. కానీ మహారాష్ట్రలోని పాలజ్‌వాసులకు మాత్రం గణపతి నవరాత్రులంటే తమ ఊళ్లోని చెక్క వినాయకుడే గుర్తొస్తాడు. ఆయన్నే తమ కష్టాలను తీర్చేవాడిగా కొలుస్తారు. ఒకసారి గణపతి నవరాత్రులకు కొలువైన బొ మ్మనే 60 ఏళ్లుగా ఎంతో భక్తిప్రపత్తులతో కొలుస్తున్నారు. ఎంతో భక్తితో ఆయనకు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. నవరాత్రుల్లో మాత్రమే ఆ […] The post ఈ గణపతిని నిమజ్జనం చేయరు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఏడాదికోసారి గణపతి నవరాత్రులొస్తాయి. రకరకాల ఆకృతుల్లో బోలెడు రంగుల్లో గణేషుడి బొమ్మలు దొరుకుతాయి. ఇంటికో బుజ్జి గణపతి కొలువుదీరితే మండపాన్ని బట్టి ఆకాశమెత్తున కొలువుదీరుతాయి. కానీ మహారాష్ట్రలోని పాలజ్‌వాసులకు మాత్రం గణపతి నవరాత్రులంటే తమ ఊళ్లోని చెక్క వినాయకుడే గుర్తొస్తాడు. ఆయన్నే తమ కష్టాలను తీర్చేవాడిగా కొలుస్తారు. ఒకసారి గణపతి నవరాత్రులకు కొలువైన బొ మ్మనే 60 ఏళ్లుగా ఎంతో భక్తిప్రపత్తులతో కొలుస్తున్నారు. ఎంతో భక్తితో ఆయనకు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. నవరాత్రుల్లో మాత్రమే ఆ యన దర్శనం లభిస్తుండడంతో ఈ వినాయకుడి దర్శనానికి జిల్లా నుండేగాక తెలంగాణాలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదారబాద్‌లతోపాటు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

ఈ గణపతికో చరిత్ర ఉంది : మొదట్లో అన్ని గ్రామాల్లాగే పాలజ్‌లోనూ వినాయకనవరాత్రులు జరిపి స్వామిని నిమజ్జనం చేసేవారు. అయితే 1948లో ఆ ప్రాంతంలో నాందేడ్ జిల్లాతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాం తాల్లో విపరీతమైన కరువువచ్చింది. దీంతో పాటు పాలజ్‌లో కలరా వ్యాపించి విపరీతంగా జనం మరణించారు. అయితే నవరాత్రుల సందర్భంగా గణపతిని నిమజ్జనం చేయడమే ఇందుకు కారణమని గ్రామస్తులు భావించారు. అందుకే అక్కడి ఒక స్వామీజీ సూచనల మేరకు కొయ్యబొమ్మలకు ప్రఖ్యాతి చెందిన నిర్మల్ పట్టణానికి వెళ్లి మంచి కలపతో నాలుగడుగుల ఎత్తుగల వినాయకుడి చెక్క విగ్రహాన్ని తయారుచేయించారు.

గ్రామస్తులు దాన్ని తీసుకువచ్చి అర్చనలు చేశారు. విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా తమ ఊరిలోనే శాశతంగా నిలుపుకోవాలన్నది వాళ్ల ఆలోచన. అందుకే ఆ స్వామికి గుడికట్టారు. ఆ విగ్రహాన్ని గ్రామంలోకి తెచ్చుకున్న తర్వాత ఆ ప్రాంతం వెనువెంటనే పాడిపంటలతో కళకళలాడిందట. కలరా మహమ్మారి కూడా ఊరినుంచి దూరమైందట. కరువు సమయంలో గోదావరి నీళ్లు లేకపోవడంతో ఒక బురద గుంటలో గణపతిని నిమజ్జనం చేయాలివచ్చిందనీ, అలాంటి పరిస్థితి మళ్లీరాకుండా ఉండడానికే చెక్క గణపతిని నిలుపుకున్నారని మరో కథనం ఉంది.

ఆ తొమ్మిది రోజులే: పాలజ్‌లోని గణపతి దేవాలయంలోని చెక్క గణపతిని ఎప్పుడంటే అపుడు దర్శనం చేసుకోలేం. కేవలం గణపతి నవరాత్రుల సందర్భంగా మాత్రమే ఆ విగ్రహాన్ని బయటకు తీసి అర్చనలు జరుపుతారు పూజారులు. ఆ సమయంలో స్వామిని దర్శనంచేసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు చత్తీస్‌గడ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. కోరిన కో ర్కెలు తీర్చే కొంగుబంగారంగా స్వామిని కొలుస్తారు.

నవరాత్రుల సమయంలో స్వామితో పా టుమరో చిన్న మట్టి విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తారు. దాన్ని గోదావరిలో నిమజ్జనం చేసి ఆ నీళ్లను తెచ్చి స్వామి విగ్రహంపైన చల్లుతారు. త ర్వాత ఆ విగ్రహాన్ని తీసి ప్రత్యేకమైన గదిలో భద్రపరుస్తారు. ఇలాగే ప్రతియేటా గణేష్ చతుర్థికే వి గ్రహాన్ని మళ్లీ బయటకు తీసి పూజలు చేసి భక్తుల దర్శనార్థం నవరాత్రులు పూజలు చేయడం సాగుతోంది. నవరాత్రుల సమయంలో ఊళ్లో మాంసాహారం తినకుండా అందరు నిష్టగా ఉంటారు. దాదాపు 75 శాతం యువతీయువకులంతా ఈ రోజుల్లో ఉపవాసాలు చేస్తారు.

Palaj Ganesh temple in Maharashtra

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఈ గణపతిని నిమజ్జనం చేయరు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.