జడల రామలింగేశ్వరస్వామి దర్శనం ఓ దివ్యానుభూతి

  ఎందరో రాజులను చంపిన పరశురాముడు తన పాపప్రక్షాళన కోసం దేశవ్యాప్తంగా 108 శివలింగాలను ప్రతిష్టించాడు. అందులో 108 వ శివలింగమే నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు జడ ల రామలింగేశ్వరుడు.  కొండగుహలో కొలువైన శివయ్య దర్శనమే ఓ దివ్యానుభూతిగా భావిస్తారు.  భక్తవత్సలుడంటే శివయ్యనే చెపుకోవాలి. కాబట్టే రాక్షసులకూ వరాలిచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. భక్తులను కాసేపు ఉడికించి ఊరడించిన కథలూ అనేకం. ఈసారి ఒక పరమభక్తుడి చేతిలో ఓ దెబ్బకూడా తిన్నా డు శివయ్య. చెర్వుగట్టు సాంబయ్యకు […] The post జడల రామలింగేశ్వరస్వామి దర్శనం ఓ దివ్యానుభూతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎందరో రాజులను చంపిన పరశురాముడు తన పాపప్రక్షాళన కోసం దేశవ్యాప్తంగా 108 శివలింగాలను ప్రతిష్టించాడు. అందులో 108 వ శివలింగమే నల్గొండ జిల్లాలోని చెర్వుగట్టు జడ ల రామలింగేశ్వరుడు.  కొండగుహలో కొలువైన శివయ్య దర్శనమే ఓ దివ్యానుభూతిగా భావిస్తారు.  భక్తవత్సలుడంటే శివయ్యనే చెపుకోవాలి. కాబట్టే రాక్షసులకూ వరాలిచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. భక్తులను కాసేపు ఉడికించి ఊరడించిన కథలూ అనేకం. ఈసారి ఒక పరమభక్తుడి చేతిలో ఓ దెబ్బకూడా తిన్నా డు శివయ్య. చెర్వుగట్టు సాంబయ్యకు జడల రామలింగేశ్వరుడన్న పేరు రావడానికి ఆ ప్రేమే కారణం. కామధేనువు విషయంలో తండ్రి జమదగ్నితో వైరం పెట్టుకోవడంతోపాటు చివరికి ఆయన హతమార్చాడు పరశురాముడు. ఆ పాపప్రాయశ్చిత్తం కోసం దేశమంతా తిరుగుతూ తపస్సు చేస్తూ గడిపాడు.

ఆ క్రమంలో 108 శివలింగాలను ప్రతిష్ట చేశాడు. అందులో చివరిదే నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని చెర్వుగట్టు రామలింగేశ్వర లింగంగా చెబుతారు. ఈ ప్రదేశంలో ఆ గుహలో పరశురాముడు ఘోర తపస్సు చేశాడట. తాను ప్రతిష్టించిన దానికన్నా శివలింగం మీద ఒక దెబ్బ వేశాడట. భక్తుడి కోపాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వెనువెంటనే ప్రత్యక్షమయ్యాడట. శాంతించమని చెబుతూ, ఆయన కోరినట్టు కలియుగాంతం వరకూ తాను అక్కడే ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తానంటూ వరమిచ్చాడట. తర్వాత పరశురాముడు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయి చివరకు శివైక్యమయ్యాడని పురాణగాథ. ఇలా కొట్టడంవల్ల శివలింగం బీటలు వారి వెనకవైపు జడలు జడలుగా జుట్టు ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈయన్ను జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తారు. ప్రస్తుతం కొండమీద స్వామి దర్శనమిస్తాడు. పార్వతీదేవి ఆలయం విడిగా ఉంటుంది.

పెద్ద జాతర:తెలంగాణ రాష్ట్రంలో ఉండే శివాలయాల్లో చెర్వుగట్టు ప్రత్యేకమైనది. ఇక్కడి శివుడికి మొక్కితే భూత పిశాచాల బాధ వదులుతుందని కొందరూ, ఆరోగ్యం ప్రాప్తిస్తుందని కొందరు నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగానూ పిలుస్తారు. 3, 5, 7, 9, 11లేదా 21 అమావాస్యలు ఈ క్షేత్రంలో స్వామి వారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల అపారమైన నమ్మకం. అందుకే ఇక్కడ అమావాస్య రోజు భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక ఏటా మాఘశుద్ధ పంచమి నుంచి ఐదురోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథసప్తమి నాటి అర్ధరాత్రి నిర్వహించే శివకళ్యాణానికి తెలంగాణా, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. జాతర సమయంలో రైతులు తమ పొలంలో పండించిన కందులు, ఆముదాలు, పత్తి, వరి తదితర ధాన్యాలను దేవుడికి సమర్పిస్తారు. జాతరకు రైతులంతా ఎడ్లబండ్లపైనే సందడిగా వస్తుంటారు. చుట్టు పక్కల వారుకూడా వచ్చి సందడిగా వేడుక జరుపుకుంటారు.

మూడు గుండ్లు : ఆలయానికి సమీపంలో ఉండే మూడు గుండ్లు అనే ప్రాంతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. గుడికి కాస్త పక్కన ఓ చోట మూడు పెద్దపెద్ద బండరాళ్లు కనిపిస్తాయి. వాటిలో మొదటి రెండింటిని ఎక్కి మూడోదాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కే దారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఉండి బక్కపలచటి మనిషి అతి కష్టంమీద దాటే దారిలా కనిపిస్తుంది. కానీ ఎంత శరీరం ఉన్న వాళ్లైనా స్వామిని స్మరిస్తూ వెళితే ఇందులోంచి అవతలికి చేరగలగడం ఇక్కడి దేవుడి మహిమకు తార్కాణంగా చెబుతారు. దేవాలయంలోని కోనేరులో స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టును చేరతారు. ఇక్కడి చెట్టుకింద చెక్కతో చేసిన స్వామి పాదుకల జతలు చాలా ఉంటాయి. వాటిని శరీరం మీద ఉంచుకుని స్వామికి మొక్కుతారు. కోనేరులోని జలం పొలాల మీద చల్లుకుంటే మంచిదని నమ్ముతారు. ఇక్కడి హనుమ, వీరభద్ర, శివరేణుక తల్లుల దేవాలయాలకు మంచి ప్రాశస్తం ఉంది.

ఇలా వెళ్లొచ్చు: చెర్వుగట్లు హైదరాబాద్ – నల్గొండ ప్రధాన రహదారిలో హైదరాబాద్ నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్లే ప్రతి బస్సు చెర్వుగట్టు నుంచే వెళుతుంది. గట్టుపైకి వెళ్లాలంటే నారెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపైన దిగి అక్కడి నుంచి 2కి.మీ. ప్రయాణించాలి. క్షేత్రానికి రోడ్డు నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. విజయవాడ, సూర్యాపేట నుంచి వచ్చేవారు నార్కెట్‌పల్లిలో దిగితే అక్కడి నుంచి 7కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది.

 

Cheruvu Gattu History in Telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జడల రామలింగేశ్వరస్వామి దర్శనం ఓ దివ్యానుభూతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.