రేపు పాలమూరు సందర్శనకు కెసిఆర్

మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఇటీవల సమీక్ష సందర్బంగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారు. ఎంత మేరకు పనులు జరిగాయన్న విషయాన్ని సిఎం స్వయంగా పరిశీలించనున్నారు. రేపు ఉదయం 9గంటలకు హెలికాప్టర్ ద్వారా కరివెన వెళ్లనున్న సిఎం పట్టెం, నార్లపూర్, ఏదుల జలాశయాలను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై అధికారులతో సిఎం సమీక్షించనున్నారు. పాలమూరు-రంగారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్ […] The post రేపు పాలమూరు సందర్శనకు కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఇటీవల సమీక్ష సందర్బంగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారు. ఎంత మేరకు పనులు జరిగాయన్న విషయాన్ని సిఎం స్వయంగా పరిశీలించనున్నారు. రేపు ఉదయం 9గంటలకు హెలికాప్టర్ ద్వారా కరివెన వెళ్లనున్న సిఎం పట్టెం, నార్లపూర్, ఏదుల జలాశయాలను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై అధికారులతో సిఎం సమీక్షించనున్నారు.

పాలమూరు-రంగారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్ పనులపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే సిఎం కెసిఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడాని విపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని మండి పడ్డాడు. పాలమూరు పచ్చబడాలన్నదే సిఎం సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని ప్రాజెక్టులతో కలిపి 22 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలన్నదే కెసిఆర్ లక్ష్యమన్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనను ముగించుకుని తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు.

Tomorrow CM KCR To Visit Mahabubnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రేపు పాలమూరు సందర్శనకు కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: