బొంబయి ఐఐటిలో ఎంటెక్ చదివి.. రైల్వే ట్రాక్‌మెన్ ఉద్యోగం

న్యూఢిల్లీ:సర్కారీ నౌకరీ అంటే మోజో లేక నిరుద్యోగ సమస్యో కారణం ఏదైనా కాని.. బొంబాయి ఐఐటీలో బిటెక్, ఎంటెక్ పట్టా పుచ్చుకున్న ఒక బీహారీ యువకుడు ధన్‌బాద్ రైల్వే డివిజన్‌లో ట్రాక్‌మెన్‌గా గ్రూప్ డి ఉద్యోగంలో చేరాడు. తాను రైల్వేలలో చేరడానికి ఉద్యోగ భద్రతా ముఖ్య కారణమని బీహార్‌కు చెందిన శ్రావణ్ కుమార్ అనే ఆ ఐఐటియన్ చెప్పాడు. చంద్రాపూర్-టెలో సెక్షన్ మధ్య అతను ప్రస్తుతం ట్రాక్‌మెన్‌గా డ్యూటీ చేస్తున్నాడు. ఒక ఐఐటియన్ గ్రూప్ డి ఉద్యోగంలో […] The post బొంబయి ఐఐటిలో ఎంటెక్ చదివి.. రైల్వే ట్రాక్‌మెన్ ఉద్యోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ:సర్కారీ నౌకరీ అంటే మోజో లేక నిరుద్యోగ సమస్యో కారణం ఏదైనా కాని.. బొంబాయి ఐఐటీలో బిటెక్, ఎంటెక్ పట్టా పుచ్చుకున్న ఒక బీహారీ యువకుడు ధన్‌బాద్ రైల్వే డివిజన్‌లో ట్రాక్‌మెన్‌గా గ్రూప్ డి ఉద్యోగంలో చేరాడు. తాను రైల్వేలలో చేరడానికి ఉద్యోగ భద్రతా ముఖ్య కారణమని బీహార్‌కు చెందిన శ్రావణ్ కుమార్ అనే ఆ ఐఐటియన్ చెప్పాడు. చంద్రాపూర్-టెలో సెక్షన్ మధ్య అతను ప్రస్తుతం ట్రాక్‌మెన్‌గా డ్యూటీ చేస్తున్నాడు. ఒక ఐఐటియన్ గ్రూప్ డి ఉద్యోగంలో చేరడం పట్ల ధన్‌బాద్ రైల్వే డివిజన్‌కు చెందిన సీనియర్ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతమైన డిగ్రీలు సంపాదించుకున్న ఒక యువకుడు ఇలా గ్రూప్ డి పోస్టులో చేరతాడని తాము ఎన్నడూ ఊహించలేదని వారు చెబుతున్నారు.

బీహార్ రాజధాని పట్నాకు చెందిన శ్రావణ్ కుమార్ ఐఐటి-బొంబాయిలో 2010లో ఇంటెగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో చేరి 2015లో డిగ్రీ పొందాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగమంటే తనకు మక్కువని అతను చెప్పాడు. భవిష్యత్తులో ఇదే ప్రభుత్వ సర్వీసులో ఆఫీసర్ అవుతానని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అతనితో పాటు ఐఐటి చదువుకున్న మిత్రులు చాలామంది కార్పొరేట్ కంపెనీలలో ఉన్నత పదవులలో ఉన్నారు. వారు ఎంత నచ్చచెప్పినప్పటికీ శ్రావణ్ మాత్రం తనకు ఇష్టమైన ప్రభుత్వ సర్వీసునే ఎంచుకోవడం విశేషం.

IITian from Bihar clears RRB Group D exam, now works as trackman in Dhanbad, The joining has come as surprise to many senior officers of the Dhanbad Railway Division

The post బొంబయి ఐఐటిలో ఎంటెక్ చదివి.. రైల్వే ట్రాక్‌మెన్ ఉద్యోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: