తెలంగాణలో నక్సలిజం లేదు : మహమూద్ అలీ

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజం లేదని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. అయితే ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొంత మేరకు నక్సలిజం ఉందని ఆయన తెలిపారు. రైతు కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా నక్సలిజంలో చేరారని ఆయన చెప్పారు. రైతుల కోసం సిఎం కెసిఆర్ రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారని మహమూద్ అలీ పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ […] The post తెలంగాణలో నక్సలిజం లేదు : మహమూద్ అలీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజం లేదని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. అయితే ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొంత మేరకు నక్సలిజం ఉందని ఆయన తెలిపారు. రైతు కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా నక్సలిజంలో చేరారని ఆయన చెప్పారు. రైతుల కోసం సిఎం కెసిఆర్ రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారని మహమూద్ అలీ పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరించిందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని కొందరు భయపెట్టారని, రాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణలో నక్సలిజం సమస్య లేకుండా పోయిందని ఆయన తెలిపారు. తెలంగాణ పోలీసులు బాగా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నక్సలిజం ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో భేటీ జరిగింది. ఈ భేటీలో తెలంగాణ తరపున మహమూద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మహమూద్ అలీ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు.

No Naxalism In Telangana : Mahmood Ali

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణలో నక్సలిజం లేదు : మహమూద్ అలీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: