మన్మోహన్ కు ఎస్ పిజి భద్రత తొలగింపు

ఢిల్లీ : భారత మాజీ ప్రదాని, రాజ్యసభ ఎంపి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు కేంద్రం ఎస్ పిజి భద్రతను తొలగించింది. ఆయనకు జడ్ ప్లస్ భద్రత కలిపించనుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ భద్రతా వ్యవహారాల కమిటీ వెల్లడించింది. ఇకపై మన్మోహన్ కు సిఆర్ పిఎఫ్ బలగాలు రక్షణ కలిపించనున్నాయి. అన్నివిధాల సమీక్ష చేసిన తరువాతనే ఆయనకు ఇస్తున్న భద్రతను తగ్గించామని కేంద్ర హోంశాఖ భద్రతా వ్యవహారాల కమిటీ తెలిపింది. మన్మోహన్ సింగ్ 2004 నుంచి […] The post మన్మోహన్ కు ఎస్ పిజి భద్రత తొలగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : భారత మాజీ ప్రదాని, రాజ్యసభ ఎంపి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు కేంద్రం ఎస్ పిజి భద్రతను తొలగించింది. ఆయనకు జడ్ ప్లస్ భద్రత కలిపించనుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ భద్రతా వ్యవహారాల కమిటీ వెల్లడించింది. ఇకపై మన్మోహన్ కు సిఆర్ పిఎఫ్ బలగాలు రక్షణ కలిపించనున్నాయి. అన్నివిధాల సమీక్ష చేసిన తరువాతనే ఆయనకు ఇస్తున్న భద్రతను తగ్గించామని కేంద్ర హోంశాఖ భద్రతా వ్యవహారాల కమిటీ తెలిపింది. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా పని చేశారు. మన్మోహన్ కు ఎటువంటి ముప్పు లేదని, అందుకే ఎస్ పిజి భద్రత తొలగించామని కేంద్ర హోంశాఖ భద్రతా వ్యవహారాల కమిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్రమోడీ, జాతీయ కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఎస్ పిజి భద్రత కలిపిస్తున్నారు.

Removal Of SPG Security To Ex PM Manmohan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మన్మోహన్ కు ఎస్ పిజి భద్రత తొలగింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: