స్టార్ హోటల్ లో హీరోయిన్‌కు ఛేదు ఘటన…

  ఈ మధ్య కాలంలో సెలబ్రెటీస్ తమకు ఇష్టమైన ఫుడ్ ను ఇంట్లో వండడం కంటే స్టార్ హోటల్లనుంచి ఆర్డర్ చేసుకోవడం పరిపాటే. ఇందుకనుగునంగానే స్టార్ హోటళ్లు.. అన్నీ రకాల రుచికరమైన వంటకాలను ఎంతో నీట్ గా తయారు చేసి ఆకట్టుకుంటున్నాయి. ఇక, సినీ స్టార్స్ బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు డబ్బులు లెక్కచేయకుండా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్‌లో బస చేస్తూ.. అక్కడ లభించే రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. తాజాగా ఓ స్టార్ హోటల్లో బస చేసిన […] The post స్టార్ హోటల్ లో హీరోయిన్‌కు ఛేదు ఘటన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీస్ తమకు ఇష్టమైన ఫుడ్ ను ఇంట్లో వండడం కంటే స్టార్ హోటల్లనుంచి ఆర్డర్ చేసుకోవడం పరిపాటే. ఇందుకనుగునంగానే స్టార్ హోటళ్లు.. అన్నీ రకాల రుచికరమైన వంటకాలను ఎంతో నీట్ గా తయారు చేసి ఆకట్టుకుంటున్నాయి. ఇక, సినీ స్టార్స్ బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు డబ్బులు లెక్కచేయకుండా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్‌లో బస చేస్తూ.. అక్కడ లభించే రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. తాజాగా ఓ స్టార్ హోటల్లో బస చేసిన హీరోయిన్ మీరా చోప్రాకు ఛేదు ఘటన ఎదురైంది.

ఈ బ్యూటీ అహ్మదాబాద్‌లో డబుల్ ట్రీ హెల్టన్ అనే ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసింది. ఈ సమయంలో ఈ అమ్మడికి ఆకలి వేయడంతో ఇక్కడ లభించే నోరూరించే వంటకాలను లాగించేయాలని ఆశపడి ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే, సర్వెంట్ తీసుకొచ్చిన ఆ ఫుడ్‌లో తెల్ల పురుగులు ఉండటం చూసి షాకైంది. వెంటనే దాన్ని వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఎంతో డబ్బులు చెల్లించి హోటల్స్‌లో ఉంటే వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

Meera Chopra slams five star hotel

 

The post స్టార్ హోటల్ లో హీరోయిన్‌కు ఛేదు ఘటన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: