వాతావ‘రణం’ తట్టుకునేలా వ్యవసాయం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న వ్యవసాయ శాఖ 15 గ్రామాల్లో 3,438 కుటుంబాలకు లబ్ధి చేకూర్చడమే లక్షం మన తెలంగాణ/హైదరాబాద్: వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం చేసేలా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులను సహకరించడంతో పాటు రైతు కుటుంబాల జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు విధానాలను పాటించి అధిక దిగుబడులు పొందాలనేది లక్ష్యంగా […] The post వాతావ‘రణం’ తట్టుకునేలా వ్యవసాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న వ్యవసాయ శాఖ
15 గ్రామాల్లో 3,438 కుటుంబాలకు లబ్ధి చేకూర్చడమే లక్షం

మన తెలంగాణ/హైదరాబాద్: వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం చేసేలా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులను సహకరించడంతో పాటు రైతు కుటుంబాల జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు విధానాలను పాటించి అధిక దిగుబడులు పొందాలనేది లక్ష్యంగా ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతుల పొలాల్లో నీటి గుంతల తవ్వకం, బిందు సేద్యం, అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాల సరఫరా, అంతర పంటల సాగువంటి విధానాలను వ్యవసాయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో చేపడతారు. రైతు కుటుంబాల జీవనోపాధి కోసం పాడి పశువులు, వాన పాముల ఎరువు తయారీ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తారు. వాతావర ణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం పేరుతో జడ్చ ర్ల, బిజినేపల్లి, ఘన్‌పూర్ క్లస్టర్లలో ఐదు గ్రామాల చొప్పున మొత్తం 15 గ్రామాలను ఎంపిక చేశారు. ఇక్రిశాట్ బేస్‌లైన్ సర్వే ప్రకారం మూడు క్లస్టర్లలో మొత్తం 8400 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే సరికి 3438 కుటుంబాలకు లబ్ధి చేకూరుతందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం మొత్తం రూ. 24 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు.
వాస్తవానికి ఈ పథకాన్ని 4 ఏళ్ల పాటు అమలు చేయాలని 2016లో నిర్ణయించారు. అయితే ప్రతి రైతుకు ఇచ్చే సొమ్ములో 50 శాతం రాయితీగా భరించాల్సి ఉంటుందని అప్పట్లో కేంద్రం ఆదేశించింది. దీంతో ఒక్కో రైతు గరిష్ఠంగా రూ.62,500 వరకు తన వాటా కింద చెల్లించాలి. ఇంత సొమ్ము పేద రైతులు కట్టలేరని, పథకం అమలు కావడం కష్టం అని రాష్ట్ర వ్యవసాయశాఖ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కేంద్రం ఇచ్చే 50 శాతం రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 25 శాతం రాయితీ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఫలితంగా ఒక్కో రైతుకు గరిష్ఠంగా అందే రాయితీ రూ.93,750కి చేరింది. రైతు తనవాటా గా రూ.28,750 చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 765 మంది రైతులు దరఖాస్తు చేశారు. ఈ పథకాకం అమలును 2021 మార్చికల్లా పూర్తియాలని లక్షంగా పెట్టుకున్నారు. నాబార్డు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్, ఈపీటీఆర్‌ఐల భాగస్వామ్యంతో ఈ పథకం అమలు చేయనున్నారు.

Agriculture Department Pilot project in Mahabubnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వాతావ‘రణం’ తట్టుకునేలా వ్యవసాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: