మత్సకారులు దళారులను నమ్మి మోసపోవద్దు

కోమటి చెరువులో చేపలను వదులుతూ ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్ సూచన మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : మత్సకారుల అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కోమటిచెరువులో లక్ష 20 వేల చేప పిల్లలను వదిలి ఆయన మాట్లాడారు. వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్న ఘనత టిఆర్‌ఎస్‌దేనన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గంలోని ఒకటి రెండు చెరువుల్లో మాత్రమే సబ్సిడీ చేప పిల్లలను వదిలేవారని గుర్తు చేశారు. […] The post మత్సకారులు దళారులను నమ్మి మోసపోవద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోమటి చెరువులో చేపలను వదులుతూ ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్ సూచన

మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : మత్సకారుల అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కోమటిచెరువులో లక్ష 20 వేల చేప పిల్లలను వదిలి ఆయన మాట్లాడారు. వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్న ఘనత టిఆర్‌ఎస్‌దేనన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గంలోని ఒకటి రెండు చెరువుల్లో మాత్రమే సబ్సిడీ చేప పిల్లలను వదిలేవారని గుర్తు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 138 చెరువుల్లో రూ. 56.40 లక్షలతో చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అనుకున్న స్థాయిలో వర్షాలు కురువక చెరువులో నీరు చేరలేదన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు మిడ్‌మానేరుకు చేరుకున్నాయని నెల రోజుల్లోపే అనంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టులకు ఈ జలాలు రానున్నాయన్నారు. కాలువలు ద్వారా అన్ని చెరువులను నీటితో నింపుతామన్నారు.

అలాగే మత్సకారులు దళారులను నమ్మి మోసపోవద్దని నేరుగా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి మార్కెటింగ్ సదుపాయం సైతం కల్పించామన్నారు.సిద్దిపేట పట్టణంలో చేపలు విక్రయించడానికి ఆధునాతన మార్కెట్ ఉందన్నారు. మత్సకారులకు సబ్సిడీపై వాహనాలు సైతం అందిస్తున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో సైతం లక్ష 80 వేల చేప పిల్లలను ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు చెరువుల్లో వదిలినట్లు తెలిపారు. అనంతరం మత్సశాఖ అధికారులు, మత్సశాఖ సంఘం ప్రతినిధులు చింతచెరువులో 54 వేల చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్మన్ వేలేటి రోజాశర్మ, మున్సిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, మత్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్షీనారాయణ, మత్సశాఖ జిల్లా అధికారి వెంకటయ్య, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్, తాళ్లపల్లి సత్యనారాయణగౌడ్, నాగరాజు, వేలేటి రాధాకృష్ణశర్మ, మత్సకారుల సంఘం ప్రతినిధులు గౌటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

MLA Harish rao Release Fishes In Komati cheruvu

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మత్సకారులు దళారులను నమ్మి మోసపోవద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: