చైనాపై దయచూపినందుకు సారీ

బియారెట్జ్ (ఫ్రాన్స్) : వాణిజ్య విషయాలలో చైనాపై తన ఆగ్రహాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. చైనాతో వాణిజ్య యుద్థానికి తాను చింతిస్తున్నట్లు చెప్పిన కొద్ది గంటలోనే ఆయన మాట మార్చారు. తాను సారీ చెప్పింది ట్రేడ్ వార్‌కు కాదని, చైనాపై సుంకాలను మరింతగా పెంచనందుకు అని తెలిపారు. జి 7 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ట్రంప్ తరఫున మహిళా అధికార ప్రతినిధి స్టెఫనీ గ్రిషమ్ విలేకరులతో మాట్లాడారు. చైనా గురించి ట్రంప్ […] The post చైనాపై దయచూపినందుకు సారీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బియారెట్జ్ (ఫ్రాన్స్) : వాణిజ్య విషయాలలో చైనాపై తన ఆగ్రహాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. చైనాతో వాణిజ్య యుద్థానికి తాను చింతిస్తున్నట్లు చెప్పిన కొద్ది గంటలోనే ఆయన మాట మార్చారు. తాను సారీ చెప్పింది ట్రేడ్ వార్‌కు కాదని, చైనాపై సుంకాలను మరింతగా పెంచనందుకు అని తెలిపారు. జి 7 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ట్రంప్ తరఫున మహిళా అధికార ప్రతినిధి స్టెఫనీ గ్రిషమ్ విలేకరులతో మాట్లాడారు. చైనా గురించి ట్రంప్ ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసకున్నారని ఈ రిసార్ట్ వేదిక నుంచి వివరణ ఇచ్చారు. చైనాతో వాణిజ్య పోరు విషయంలో పునరాలోచన ఉందా? అనే ప్రశ్నకు ట్రంప్ చెప్పింది వేరు, ప్రచారం జరిగింది వేరని స్టెఫనీ తెలిపారు.

మరింతగా సుంకాల భారం మోపకపోవడం పట్ల చింతిస్తున్నానని ఆయన చెప్పారని, అయితే ట్రేడ్‌వార్ పట్ల సారీ చెప్పారని అంటున్నారని ఇది సరికాదని అన్నారు. తనకు అన్ని అంశాలపై రెండో ఆలోచనలు కూడా ఉంటాయని, చైనాతో వాణిజ్య యుద్ధంపై తమ వైపు నుంచి సడలింపులు ఉంటాయని ఆదివారం ఇక్కడనే తొలుత ట్రంప్ తెలిపారు. పైగా చైనా కంపెనీలను దేశం నుంచి బహిష్కరించే అసాధారణ చర్యలకు వీలుగా తాను దేశంలో అత్యయిక స్థితిని విధించవచ్చునని, ఈ హక్కు తనకు ఉందని తేల్చిచెప్పారు. అయితే చైనా విషయంలో పునరాలోచన కూడా ఉందనే సంకేతాలు ఇచ్చారు. అయితే కొద్ది గంటల వ్యవధిలోని ట్రంప్ అంతరంగంలోని అసలు విషయం గురించి ఆయన అధికారిక ఆంతరంగికురాలు తేల్చిచెప్పారు.
ఫ్రాన్స్ చేరిన ప్రధాని మోడీ
జి7 శిఖరాగ్ర సభకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఫ్రాన్స్ చేరుకున్నారు. పర్యావరణం, వాతావరణం, డిజిటల్ మార్పిడి వంటి ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న అంశాలపై ఆయన ప్రసంగిస్తారు. ఆ సందర్భంలోనే ప్రపంచ నాయకుల్ని కూడా కలుసుకుంటారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోడీ యుఎఇ, బహరెయిన్‌లను సందర్శించి మనానా నుంచి ఫ్రాన్స్ చేరుకున్నారు. బహరెయిన్‌లో భారత ప్రధాని గల్ఫ్ ప్రాంతంలోనే అతి పురాతనమైన శ్రీనాథ్‌జీ ఆలయంలో ప్రార్థనలు జరిపారు. ‘ జి 7 శిఖరాగ్ర సభలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లోని బియారిజ్ చేరుకున్నారు.
సభలో వివిధ అంశాలపై ప్రసంగించడమే కాక, ద్వైపాక్షిక సమావేశాల్లో ఆయన ప్రపంచ నాయకుల్ని విడివిడిగా కలుసుకుంటారు’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఫ్రెంచి తీర ప్రాంత పట్టణం బియారిజ్‌లో జి 7 సభ జరుగుతుంది. జి 7లో ఇండియాకు సభ్యత్వం లేనప్పటికీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ మోడీని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఆయనను ఆహ్వానించేందుకు… రెండు దేశాల నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు, ఇండియాను ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా గుర్తించడం అనేవే కారణాలని విదేశీ వ్యవహారాల (ఎంఇఎ) మంత్రిత్వ శాఖ తెలిపింది. జి 7లో బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా ఉన్నాయి. జి 7 సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కలుసుకొని కశ్మీర్‌లో పరిస్థితి, వాణిజ్య వ్యవహారాలు, పరస్పరం ప్రయోజనం కలిగించే ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గత వారంలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ జి 7 లో కలుసుకున్నప్పుడు కశ్మీర్‌లో పరిస్థితిపై తను మోడీతో చర్చిస్తానని, ఇండోపాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు సాయం చేస్తానని చెప్పారు.

Donald Trump Fires On China

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చైనాపై దయచూపినందుకు సారీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: