ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా రాకపోకల సౌకర్యాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆదివారం ఏకదాటిగాకురిసిన భారీ వర్షాల కారణంగా పలు చోట్ల వాగుల వరద నీరు రోడ్లపై నుండి ప్రవహిస్తుండగా ఆర్‌టిసి అధికారులు బస్సు సర్వీస్‌లను నిలిపివేశారు. దీంతో 132 గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం, చింతలమానెపల్లి, తిర్యాణి మండలాల్లో భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయి నేలమట్టమయ్యాయి. అంతేకాకుండా కన్నెపల్లి మండలం క్రాస్ రోడ్డు […] The post ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా రాకపోకల సౌకర్యాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆదివారం ఏకదాటిగాకురిసిన భారీ వర్షాల కారణంగా పలు చోట్ల వాగుల వరద నీరు రోడ్లపై నుండి ప్రవహిస్తుండగా ఆర్‌టిసి అధికారులు బస్సు సర్వీస్‌లను నిలిపివేశారు. దీంతో 132 గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం, చింతలమానెపల్లి, తిర్యాణి మండలాల్లో భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయి నేలమట్టమయ్యాయి. అంతేకాకుండా కన్నెపల్లి మండలం క్రాస్ రోడ్డు నుండి కన్నెపల్లి సబ్ స్టేషన్ రోడ్డు వరకు ఇటీవల నిర్మించిన రోడ్డు వరదలకు కొట్టుకుపోయింది. దీంతో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అదే విధంగా బెజ్జూర్ మండలంలోని ఏడు వాగులు,వేమనపల్లి మండలంలోని రెండు వాగులు పెద్ద ఎత్తున ఉప్పొంగడంతో వరద ప్రవాహాన్ని దాటవద్దని పోలీసు, రెవెన్యూ అదికారులు వాగుల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల మంచిర్యాలజిల్లాలోని పలు ఓపెన్‌కాస్టులలో పనులు నిలిచిపోగా సింగరేణి సంస్థకు 60 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించి పోయింది. పట్టణాల్లోని లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏది ఏమైనా భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది.

Rtc bus services stopped after flooding on Roads

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: