కిమ్ భారీ రాకెట్ ప్రయోగం

సియోల్ : ఉత్తర కొరియా సరికొత్త సూపర్ లార్జ్ బహుళ స్థాయి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ కార్యక్రమాన్ని దేశ అధినేత కిమ్ జాం గ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాతో అణు చర్చల పునరుద్ధరణ అవకాశాల నేపథ్యంలోనే ఉత్తర కొరియా ఈ పరీక్షను చేపట్టింది. అణ్వాయుధ పాటవాన్ని బలోపేతం చేసుకునే ప్రక్రియలో భాగంగానే కిమ్ ఆదేశాలతో ఈ భారీ స్థాయి రాకెట్ ప్రయోగం జరిగింది. శనివారం రాత్రి జరిపిన ఈ పరీక్ష […] The post కిమ్ భారీ రాకెట్ ప్రయోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


సియోల్ : ఉత్తర కొరియా సరికొత్త సూపర్ లార్జ్ బహుళ స్థాయి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ కార్యక్రమాన్ని దేశ అధినేత కిమ్ జాం గ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాతో అణు చర్చల పునరుద్ధరణ అవకాశాల నేపథ్యంలోనే ఉత్తర కొరియా ఈ పరీక్షను చేపట్టింది. అణ్వాయుధ పాటవాన్ని బలోపేతం చేసుకునే ప్రక్రియలో భాగంగానే కిమ్ ఆదేశాలతో ఈ భారీ స్థాయి రాకెట్ ప్రయోగం జరిగింది. శనివారం రాత్రి జరిపిన ఈ పరీక్ష విజయవంతం కావడం పట్ల దేశాధినేత కిమ్ హర్షం వ్యక్తం చేశారని ఉత్తర కొరియా ప్రధాన వార్తాసంస్థ తెలిపింది. రాకెట్ ప్రయోగం నిజంగా దేశ ఆయుధ సంపత్తి దిశలో కీలక మైలు రాయి అవుతుందని కూడా వెల్లడించారు. విద్వేషశక్తులకు తగు జవాబు ఇవ్వడానికి ఇటువంటి ఒత్తిడి చర్యలు అత్యవసరం అని తెలిపారు. అమెరికా, దక్షణ కొరియాలను దృష్టిలో పెట్టుకునే కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడైంది.

North Korea Kim Guides Test Fire of New Rocket Launcher

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కిమ్ భారీ రాకెట్ ప్రయోగం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: