మన ఘన సింధు..పసిడి విందు

భారత స్టార్ షట్లర్ పివి సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ ప్రదర్శనతో మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో వరసగా మూడోసారి ఫైనల్‌కు చేరిన ఈ తెలుగు తేజం అత్యుత్తమ ఆటను ప్రదర్శించి స్వర్ణం దక్కించుకుని ఈ ఘనతను సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఫైనల్లో 217,217 స్కోరుతో వరస గేముల్లో జపాన్ క్రీడాకారిణి , ప్రపంచ నాలుగో […] The post మన ఘన సింధు..పసిడి విందు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భారత స్టార్ షట్లర్ పివి సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ ప్రదర్శనతో మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో వరసగా మూడోసారి ఫైనల్‌కు చేరిన ఈ తెలుగు తేజం అత్యుత్తమ ఆటను ప్రదర్శించి స్వర్ణం దక్కించుకుని ఈ ఘనతను సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఫైనల్లో 217,217 స్కోరుతో వరస గేముల్లో జపాన్ క్రీడాకారిణి , ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఒకుహరను చిత్తు చేసింది. 2017 ఫైనల్లో అదే క్రీడాకారిణి చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని లెక్క సరి చేసింది. గత రెండు పర్యాయాలు ఫైనల్లో తడబడి సిల్వర్ మెడల్‌కే పరిమితమైన ఆమె ఈ రోజు ఫైనల్ ఫోబియో దాటలేకపోతోందన్న విమర్శకుల నోళ్లు మూయించి యావత్తు భారతావని గర్వించేలా చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణం గెలిచిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం సింధుకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మెదలుకొని క్రీడా, రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులనుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

 ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్, కెటిఆర్ మున్నగు ప్రముఖుల అభినందన పరంపర

బాసెల్(స్విట్జర్లాండ్): కోట్లాది భారతీయుల గుండె గొంతుకను ప్రపంచ చాంపియన్‌షిప్ వేదికపై వినిపించిన సింధూర నాదమిది. పదహారణాల అచ్చమైన మన తెలుగమ్మాయి సాధించిన అద్భుతమిది.. దేశం యావత్తు గర్వించేలా చేసిన క్షణమిది. 24 ఏళ్ల వయసుకే పూసర్ల వెంకట సింధు చరిత్ర సృష్టించింది. వరసగా మూడు సారు ్లప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన ఈ హైదరాబాదీ అమ్మాయి తన స్వర్ణం ముచ్చటను తీర్చుకుంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఫైనల్లో 217,217 స్కోరుతో వరస గేముల్లో జపాన్ క్రీడాకారిణి , ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఒకుహరను చిత్తు చేసింది. 2017 ఫైనల్లో అదే క్రీడాకారిణి చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని లెక్క సరి చేసింది. గత రెండు పర్యాయాలు ఫైనల్లో తడబడి

సిల్వర్ మెడల్‌కే పరిమితమైన ఆమె ఈ రోజు ఫైనల్ ఫోబియో దాటలేకపోతోందన్న విమర్శకుల నోళ్లు మూయించి యావత్తు భారతావని గర్వించేలా చేసింది. ఫలితంగా నాలుగు దశాబ్దాలుగా ఊరించిన పసిడి కల నెరవేరింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను దక్కించుకుంది. గతంలో అయిదు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో నాలుగు పతకాలు అందుకున్న సింధు ఈ సారి పసిడి పతకం అందుకునే దాకా పట్టు వదల లేదు. శనివారం సెమీఫైనల్లో విజయం తర్వాత సింధు మాట్లాడుతూ పోరు ఇంకా ముగియలేదని, ఫైనల్లో విజయం సాధించినప్పుడే తనకు సంతృప్త్తి అని చెప్పింది. అన్నట్లుగానే ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్, రెండేళ్ల క్రితం తన పసిడి కలను కల్లలు చేసిన నొజోమి ఒకుహరాపై గెలిచి జగజ్జేతగా నిలిచింది. రెండేళ్లనాటి ఫైనల్ పోరును గుర్తు చేసే విధంగా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ వరస గేమ్‌లలో అలవోకగా గెలిచి తన చాంపియన్ కలను సాకారం చేసుకుంది. తొలినుంచి ఒకుహరా అంచనాలకు అందకుండా సింధు ఏకపక్షంగా ఆటను కొనసాగించింది. సుదీర్ఘ ర్యాలీలు, అద్భుతమైన స్మాష్‌లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టడంతో పాటు అద్భుతమైన రిటర్న్‌లతో అలరించింది. ఫలితంగా కేవలం 16 నిమిషాల్లో 217 పాయింట్లతో తొలి గేమ్‌ను దక్కించుకుని ప్రత్యర్థిపై మానసికంగా పై చేయి సాధించింది.

రెండో గేమ్ కూడా దాదాపుగా అదే ధోరణిలో సాధించింది. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వడానికి ఒకుహరా ఎంతగానో శ్రమించింది కానీ సింధు ఏమాత్రం అవకాశమివ్వలేదు. ఫలితంగా తొలి గేమ్‌లాగానే రెండో గేమ్ కూడా 217 తేడాతోనే దక్కించుకుని టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా 2017ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఒకుహరాతో జరిగిన ఫైనల్ పోరులో ఓటమికి బ్రదులు తీర్చుకుంది.ఈ గెలుపుతో ఒకుహరా లెక్కను సరి చేసింది.ప్రత్యర్థి ఆటపై మంచి హోంవర్క్ చేసి వచ్చిన సింధు దాన్ని కోర్టులో పూర్తిగా అమలు చేసింది.ఆరంభంనుంచి దూకుడు ప్రదర్శించిన సింధు ప్రతి పాయింట్ కోసం శ్రమించింది. ప్రత్యర్థికి ఏ దశలోను ఆధిక్యత సాధించే అవకాశమివ్వలేదు.ఎలాగైనా స్వర్ణం సాధించాలనే కసితోనే సింధు ఆట తీరు సాగింది. మరోవైపు ఫైనల్ ఫోబియోకు చెక్‌పెట్టాలనే ఏకైక లక్షమే ఆమెకు స్వర్ణ పతకాన్ని తెచ్చి పెట్టింది.ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు ఇది అయిదో పతకం. దీంతో ఆమె మాజీ ఒలింపిక్,ప్రపంచ చాంపియన్, చైనాకు చెందిన ఝాంగ్ నింగ్‌తో సమానంగా నిలిచింది. సింధు సాధించిన పతకాల్లో రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి.

PV Sindhu first Indian to win World Badminton Championship

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మన ఘన సింధు..పసిడి విందు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: