సమాజానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ

  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నాగార్జునసాగర్ : తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం హిల్‌కాలనీలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ ఒక కులానికి సంబందించిన ది కాదని మొత్తం తెలంగాణ సమాజానికే స్ఫూర్తి దాయకమని అన్నారు. చాకలి ఐలమ్మ […] The post సమాజానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

నాగార్జునసాగర్ : తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం హిల్‌కాలనీలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ ఒక కులానికి సంబందించిన ది కాదని మొత్తం తెలంగాణ సమాజానికే స్ఫూర్తి దాయకమని అన్నారు. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ఐకాన్ అని అన్నా రు.

తెలంగాణ ప్రాంతంలో సాంఘిక, సామాజిక, ఉద్యమాలకు పూనాది వేసిన వీర వనిత ఐలమ్మ అని ఆమె ఆశయాలను స్ఫూర్తిగా  తీసుకొని ప్రతిఒక్కరు ముందుకు సాగాలని అన్నారు. ఐలమ్మ ఉద్యమ పిలుపు నిజాం నవాబు గుండెల్లో వణుకు తె ప్పించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవంను ప్రభుత్వం ప్రతీ ఏటా జరిపేలా తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, ఎమ్మె ల్యే నోముల నర్సింహయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఇరిగి పెద్దు లు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ రామారావు, కాటు కృష్ణ, రజక సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Chakali ilamma Inspiration for the community

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సమాజానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: