‘ప్రియమైన కథకుల’ సమూహ విజయం

  ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపుల్లో లేని కవి, రచయితని పట్టుకోవడం దుర్లభమే. స్మార్ట్‌ఫోను వాడకం మామూలైపోయినాక మొబైల్ నెంబరు తెలిస్తే చాలు గ్రూపు నిర్వాహకులు ఎవర్నైనా సభ్యులుగా చేర్చుకోవచ్చు. ఫిబ్రవరి 2016 దాకా ఒక్కో వాట్సాప్ గ్రూపుకు 100 మంది చేర్పుకు వీలుకాగా ఆ తర్వాత అతి 256కు పెరిగింది. ఈ సంఖ్యను దాటేందుకు కూడా కొన్ని సాంకేతిక మార్గాలున్నాయి. పత్రికల్లో ప్రచురించిన రచనతో పాటు రచయిత ఫోన్ నెంబరు కూడా వేయడంతో రచయితలతో మాట్లాడి […] The post ‘ప్రియమైన కథకుల’ సమూహ విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపుల్లో లేని కవి, రచయితని పట్టుకోవడం దుర్లభమే. స్మార్ట్‌ఫోను వాడకం మామూలైపోయినాక మొబైల్ నెంబరు తెలిస్తే చాలు గ్రూపు నిర్వాహకులు ఎవర్నైనా సభ్యులుగా చేర్చుకోవచ్చు. ఫిబ్రవరి 2016 దాకా ఒక్కో వాట్సాప్ గ్రూపుకు 100 మంది చేర్పుకు వీలుకాగా ఆ తర్వాత అతి 256కు పెరిగింది. ఈ సంఖ్యను దాటేందుకు కూడా కొన్ని సాంకేతిక మార్గాలున్నాయి. పత్రికల్లో ప్రచురించిన రచనతో పాటు రచయిత ఫోన్ నెంబరు కూడా వేయడంతో రచయితలతో మాట్లాడి తమ అభిప్రాయాలు చెప్పడం, చర్చించడం తేలికైపోయింది. ఇక వాట్సాప్ గ్రూపు నిర్వాహకులకు రచయితల నెంబర్లు కోరినన్ని అందుబాటులోకొచ్చినయి.

ఈ రకంగా తమకు తెలియకుండానే వివిధ గ్రూపుల్లో ఒకరు కావడం రచనా రంగంలో ఉన్న వారికి అనుభవ విషయమే. అయితే గ్రూపు ఆరంభించడం కన్నా దాని నిర్వహణ సమర్థతతో కూడుకున్న పని. గ్రూప్ అడ్మిన్‌లకు చట్టపరమైన సాదకబాదకాలు కూడా ఉంటాయి. గత రెండు మూడేళ్లుగా గ్రూప్ నిర్వహణలో ఆసక్తిగల వారు వివిధ నామకరణాలతో సాహితీరంగ స్థలం ఏర్పాటు చేస్తున్నారు. రచనలు, ఇతర సమాచారం ఇచ్చిపుచ్చు కోవడానికి ఈ వేదికలు ఎంతో తోడ్పడుతున్నాయి. వీటిలో పాల్గొనేందుకు, సక్రియ పాత్ర పోషించేందుకు చాలామంది తమ సమయాన్ని కేటాయించడం కొన్ని గ్రూపులు పరుగులు తీస్తున్నయి.

విశాఖ ప్రాంతం నుంచి ఆరంభమైన “ప్రియమైన కథకులు” అనే వాట్సాప్ గ్రూపు తెలుగు కథారచయితలకు చావదిలా తయారైంది. మొబైల్‌లో ఉన్న సమాచారం ప్రకారం ఈ గ్రూపు 5 జులై 2018లో మొదలైనట్లున్నా నిర్వాహకులు మాత్రం 5 మే, 2016 నుండి తాము గ్రూపు నడుపుతున్నట్లు చెబుతున్నారు. దీనికి ప్రముఖ రచయిత ఇందూ రమణ ముఖన నిర్వాహకులు కాగా మరి తొమ్మిది మంది రచయితలు అడ్మిన్‌లుగా కొనసాగుతున్నారు. సభ్యులుగా 200కుపైగా కవులు, రచయితలున్నారు. ఆడెపు లక్ష్మీపతి, అల్లం రాజయ్య, అబల్ల జనార్ధన్, అయోధ్యారెడ్డి, ద్విభాష్య రాజేశ్వరరావు, ఎం.వి.రామిరెడ్డి, పలమనేరు బాలాజీ, పర్కపల్లి యాదగిరి, ఎనుగంటి వేణుగోపాల్, దాట్ల దేవదానం రాజు, మాధవీ సనారి, కొనెనాశవెంకట ఆంజనేయులు, కెకె. రఘునందన్.

భాగ్యశ్రీ, ఆచారి విజయలక్ష్మి, యమున, గొర్తివాణి పద్మావతి, ఇలా ఎందరో ప్రస్తుతం రచనా సేద్యంలో ఉన్న ప్రముఖులు ఇందులో సభ్యులుగా కనబడుతున్నారు. పేరుకే జన్నాల అన్నట్లు కాకుండా చాలామంది రచయితలు తమ ప్రచురిత కథలను ఈ గ్రూపులో పెట్టడం వల్ల వాటిపై సముచిత చర్చ జరుగుతుంది. ఆయా కథల్ని చదివి అభిప్రాయాల్ని, సూచనల్ని చేస్తున్నావారూ అధికంగానే ఉన్నారు. కథల శీర్షికల పట్ల, ముగింపు, కథనం విషయంలోనూ కొంత లోతైన చర్చ కూడా కనబడుతుంది. ఒక్కోరోజు సుమారుగా 50 పాపోస్టింగులుంటాయి. పక్కన కూర్చోని ముచ్చట్లాడినట్లు వెవ్వెంటనే ప్రతిస్పందనలు వస్తుంటాయి. ప్రముఖ బాలల, హాస్య రచయిత కానేనాశ వెంకట ఆంజనేయులు ఛలోక్తులు, మాట విరుపులు పాల్గొంటున్నవారిని ఆహ్లాదపరుస్తుంటాయి.

ఇన్ని ఉన్నా అనవపరపు, అసంబద్ధ పోస్టింగులపై ఇందూరమణ సమీక్షా, సవరణలు గ్రూపును పట్టాలు తప్పకుండా కాపాడతాయి. ఈ గ్రూపులో పాల్గొంటున్నవారి కథల ప్రస్తావన, చర్చయే కాకుండా కథల, వివిధ ఇతర సాహితీ ప్రక్రియల పోటీల సమాచారం సత్వరం లభిస్తుంది. తెలుగులో ఏ ప్రతిక, ఏ సాహితీ సంస్థ పోటీలు నిర్వహించినా ఈ గ్రూపులో దానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. వాటి పట్ల ఏదైనా అనుమానాలు ఉన్నా సంప్రదింపులతో పరిష్కరించుకుంటారు. పోటీల విజేతల ప్రకటనతో తోటి సభ్యుల విజయాలపై అభినందనలు, స్టిక్కర్ల ద్వారా బొకేలు అందజేయడం సర్వసాధారణమే.

అయితే ప్రియమైన కథకులు సాధించిన మరో గొప్ప కార్యమేమిటంటే గత నెల సభ్యులతో రెండురోజుల సాహితీ కార్యక్రమాలు ఏర్పరచడం. గ్రూపు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలో జులై 27, 28 తేదిల్లో భారీ ఎత్తున ఈ సంరంభం జరిగింది.ఈ కార్యక్రమం దృష్టితోనే మార్చి నెలలో మన కోసం మనం అనే కథల పోటీని నిర్వమించంది. కథకుల పేర్లు బయటపడకుండా పోటీలో పాల్గొన్న సభ్యులు కథలను ఆడ్మిన్ల నెంబర్లకే పంపాలి. అడ్మిన్లు తిరిగి ప్రియమైన కథకులు లో సభునాలు చదివేందుకు దించుతారు. చదివిన సభ్యులు ఇచ్చిన మార్కుల ఆధారంగా విజేతల ఎంపిక జరిగింది. పోటీలోగిలు పొంచిన కథలతో పాటు పోటీకి వచ్చిన కథల్లోంచి మరిన్ని వాటికి ఎంపిక చేసి నూరు కథలు అనే కథా సంఘటాన్ని ప్రచురించి ఈ సమావేశాల్లో ఆవిష్కరించారు. ఈ కథ సంఘటిని ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత వేగిరిరాంబాబుకు అంకితమియడం జరిగింది.

తొలిరోజు జరిగిన కార్యక్రమానికి నవ్య వీక్లీ సంపాదకులు ఎ. జగన్నాథశర్మ వాఖ్య అతిధిగా పాల్గొన్నారు. కథ, నవల, భాష తదితర సాహితీ అంశాలపై ప్రముఖుల ఉపన్యాసాలు సాగాయి. కథా సాహిత్యంపై డా. దామెర కెంకట సూర్యారావు ప్రసంగించారు. కథ క్లుప్తంగా, సష్టంగా, అర్హత నిండి ఉండాలని సోదాహరణగా ఆయన సభికులకు మెలకువలు తెలిపారు. నవలా సాహిత్యంపై ప్రముఖ రచయిత మంజరి (గ్రంధం నాగేశ్వర రావు), కవిత్వంపై డా. అయ్యగారి సీతారత్నం, భాషపై డా. వెలమల సిమ్మన్న ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కృష్ణా జిల్లా భాషే ప్రామాణికం కాదని, అసలు మాండలికాలే లేవు, ఏ ప్రాంత బాష ఆ ప్రాంతానికి ప్రామాణికమని సిమ్మన్న తెలుగు భాషను విశ్లేషిస్తూ ప్రస్తావించారు.

రెండో రోజు సుమారు నూటయాబై కవుల సమ్మేళనం నిర్వహించబడింది. సాహితీ క్విజ్ ముగించి ఆకర్ణణగా చెప్పవచ్చు. మూడున్నరేళ్లుగా గ్రూపు ద్వారా పరిచమయై ఒకరికొకరు ఆప్తులైననాముఖ పరిచయాలు, ప్రత్యక్ష కలయికకు ఈ సమావేశం వేదిక అయ్యింది. వ్యక్తిగతంగా కలిసి అనుభూతులను, అనుభవాలను పంచుకోవడం సభ్యులకు ఎంతో తృప్తినిచ్చిందనవచ్చు. ఒక సంకల్పం కార్యరూపం దాలిస్తే ఎన్ని రంగుల్ని విరజిమ్ముతుందో ప్రత్యక్షంగా కనడానికి ఈ సాహితీ సంరంభమే సాక్షం.

WhatsApp increases group chat size limit to 256 people

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘ప్రియమైన కథకుల’ సమూహ విజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: