కశ్మీరిలో ఆంక్షలకు నిరసనగా కేరళ ఐఏఎస్ రాజీనామా

  తిరువనంతపురం: ఇటీవల కేంద్ర ప్రభుత్వం అర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గత కొద్దిరోజులుగా ఆంక్షలు విధించారు. అయితే, జమ్మూకశ్మీరిలో భద్రత పేరుతో అక్కడి ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఆంక్షలు విధిస్తున్నరంటూ కేరళ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి కన్నన్‌ గోపీనాథన్‌(33) తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2012 బ్యాచ్ కు చెందిన […] The post కశ్మీరిలో ఆంక్షలకు నిరసనగా కేరళ ఐఏఎస్ రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తిరువనంతపురం: ఇటీవల కేంద్ర ప్రభుత్వం అర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గత కొద్దిరోజులుగా ఆంక్షలు విధించారు. అయితే, జమ్మూకశ్మీరిలో భద్రత పేరుతో అక్కడి ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఆంక్షలు విధిస్తున్నరంటూ కేరళ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి కన్నన్‌ గోపీనాథన్‌(33) తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2012 బ్యాచ్ కు చెందిన గోపీనాథన్‌ ఈ నెల 21న తన రాజీనామా పత్రాన్ని కేంద్రానికి పంపాడు. తన రాజీనామాను ఆమోదించవల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా గోపీనాథన్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా వల్ల అక్కడ పరిస్థితులేమీ మారబోవని, కానీ ఈ చర్య ఆలోచింపజేస్తుందని అన్నారు.  ప్రస్తుతం గోపీనాథన్‌ దాద్రా నగర్‌ హవేలీలో విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

IAS Officer Resigns due to Restrictions in Jammu Kashmir

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీరిలో ఆంక్షలకు నిరసనగా కేరళ ఐఏఎస్ రాజీనామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: