ప్రీ బిజినెస్‌లో రికార్డు

  ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ‘సాహో’ చిత్రం ఈనెల 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలోనే టాప్ 3 ప్రీ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. 2.0, బాహుబలి చిత్రాల తర్వాత ఈ చిత్రం బిజినెస్ పరంగా మూడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రీ బిజినెస్‌తోపాటు ప్రీ హైప్ కూడా ఆ స్థాయిలోనే ఉంది. […] The post ప్రీ బిజినెస్‌లో రికార్డు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ‘సాహో’ చిత్రం ఈనెల 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలోనే టాప్ 3 ప్రీ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. 2.0, బాహుబలి చిత్రాల తర్వాత ఈ చిత్రం బిజినెస్ పరంగా మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ప్రీ బిజినెస్‌తోపాటు ప్రీ హైప్ కూడా ఆ స్థాయిలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ మానియా అభిమానులను ఊపేస్తోంది. అందుకు తగ్గట్టే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే 90 శాతం మొదటి రోజు షోలకు టిక్కెట్లు అమ్మేశామని ప్రఖ్యాత ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్ పేర్కొంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ హుషారు చూస్తుంటే తొలిరోజు ‘బాహుబలి 2’ ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ రికార్డులను ‘సాహో’ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

‘బాహుబలి 2’ చిత్రం మొదటి రోజు 124 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డుని ‘సాహో’ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. డే వన్‌తో పాటు తొలి వీకెండ్ రికార్డులను ఈ చిత్రం అందుకుంటుందా? అనేది చూడాలి. ఇక ఈ చిత్రం 2.51 గంటల నిడివితో ప్రేక్షకులను అలరించనుంది.

Saho movie record in pre-business

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రీ బిజినెస్‌లో రికార్డు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: