జర్నలిస్టుల ఇండ్లకు కృషి చేస్తా: మంత్రి ఎర్రబెల్లి

  సుబేదారి : వరంగల్ నగర జర్నలిస్టుల పరిస్థితి తనకు 37 ఏళ్లుగా తెలుసునని, కనీసం గూడు లేని దుస్థితిలో ఉన్నారని వారి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ప్రతిఒక్కరికి ఇండ్లు కట్టించి ఇప్పిస్తానన్నారు. ఆదివారం వరంగల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్రీడా బహుమతులు, ఉత్తమ ఫొటోగ్రాఫర్స్ సన్మానం ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా […] The post జర్నలిస్టుల ఇండ్లకు కృషి చేస్తా: మంత్రి ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుబేదారి : వరంగల్ నగర జర్నలిస్టుల పరిస్థితి తనకు 37 ఏళ్లుగా తెలుసునని, కనీసం గూడు లేని దుస్థితిలో ఉన్నారని వారి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ప్రతిఒక్కరికి ఇండ్లు కట్టించి ఇప్పిస్తానన్నారు. ఆదివారం వరంగల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్రీడా బహుమతులు, ఉత్తమ ఫొటోగ్రాఫర్స్ సన్మానం ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడల్లో బహుమతులు గెలుచుకున్న క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. అలాగే వివిధ ఫొటోగ్రఫీ పోటీలలో రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ఏడుగురు ఫొటో జర్నలిస్టులను ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ కార్యవర్గ తరపున మంత్రి సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఇండ్ల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే అందరికి ఇప్పిస్తానన్నారు. తన రాజకీయ ఎదుగుదలలో ప్రతి ఒక్క జర్నలిస్టు కృషి ఉందన్నారు. స్థల పరిశీలన కోసం వరంగల్ అర్బన్ కలెక్టర్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు. యాజమాన్యం చెప్పిందే కాకుండా వాస్తవాలను రాయాలన్నారు. పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల విలేకర్లు ఒత్తిడిని అధిగమిస్తారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం మంత్రితో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి జర్నలిస్టులను మైమరపింపజేసింది.

ఈ కార్యక్రమంలో తూర్పు ఎంఎల్‌ఎ నన్నపునేని నరేందర్, నగర మేయర్ గుండా ప్రకాష్‌రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్య, సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్ కోశాధికారి బొమ్మినేని సునీల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు గోకారం సుధీర్, సంయుక్త కార్యదర్శులు కేసనపల్లి రంజిత్‌కుమార్, సదానందం కార్యవర్గ సభ్యులు దిలీప్, శ్రీకాంత్, డిడి శ్రీనివాస్, సంజీవ్, రమేష్, కట్ట రాజు, సీనియర్ జర్నలిస్టు దాసరి కృష్ణారెడ్డి, నూర శ్రీనివాస్, లెనిన్, మండువ రవీందర్‌రావు, పివి మదన్‌మోహన్, శంకేషి శంకర్‌రావు, దొంతు రమేష్, వల్లాల వెంకటరమణ, కంకణాల సంతోష్, కృష్ణ, గోవింద్, అశోక్, గడ్డం కేశవమూర్తి, పివి కొండల్‌రావు, బుచ్చిరెడ్డి, ప్రశాంత్, సీనియర్ జర్నలిస్టులు ప్రెస్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Errabelli said he would Work for Houses of Journalists

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జర్నలిస్టుల ఇండ్లకు కృషి చేస్తా: మంత్రి ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: