పివి సింధుకు కెసిఆర్‌, మోదీ, జగన్‌ అభినందనలు

  హైదరాబాద్:  ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సరికొత్త రికార్డు సృష్టించిన పివి సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. అద్భుత విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన్నట్టు సిఎం కెసిఆర్ అన్నారు. ఇదిలా ఉండగా ఛాంపియన్ గా నిలిచి ప్రపంచ బ్యాడ్మింటన్ లో స్వర్ణం కల సాకారం చేసుకున్న తొలి భారత్ షట్లర్ గా సింధు రికార్డు సాధించింది. ఆదివారం మధ్యాహ్నం […] The post పివి సింధుకు కెసిఆర్‌, మోదీ, జగన్‌ అభినందనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్:  ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సరికొత్త రికార్డు సృష్టించిన పివి సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. అద్భుత విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన్నట్టు సిఎం కెసిఆర్ అన్నారు. ఇదిలా ఉండగా ఛాంపియన్ గా నిలిచి ప్రపంచ బ్యాడ్మింటన్ లో స్వర్ణం కల సాకారం చేసుకున్న తొలి భారత్ షట్లర్ గా సింధు రికార్డు సాధించింది.

ఆదివారం మధ్యాహ్నం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సింధు 21-7, 21-7 తేడాతో ఒకుహరా (జపాన్)పై సునాయాస విజయం సాధించింది. దీంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ గవర్నర్ నరసింహన్, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, స్వీకర్ పోచారం, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, తదితరులు అభినందనలు తెలియజేశారు.

Celebrities congratulate to PV Sindhu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పివి సింధుకు కెసిఆర్‌, మోదీ, జగన్‌ అభినందనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: