రూల్స్ ఉల్లంఘిస్తే ఇక బాధుడే!

  హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మోటారు వాహనాల సవరణ చట్టం వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి అమలు కానుంది. ఈ చట్టం కింద నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై భారీగా జరిమానాలు ఉండబోతున్నాయి. అలాగే అంబులెన్స్‌లకు వెంటనే దారి ఇవ్వకపోయినా వాహనదారులకు చిక్కులు తప్పవు. సదరు వాహనదారులపై కొరఢా ఝుళిపిస్తారు. మోటారు వాహన చట్టం నిబంధనలను అతిక్రమించే వారిపై ప్రస్తుతం ట్రాఫిక్ అధికారులు జరిమానాలు విధిస్తున్నప్పటికీ అవి నామమాత్రంగా ఉంటున్నాయి. దీంతో వాహనదారులు […] The post రూల్స్ ఉల్లంఘిస్తే ఇక బాధుడే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మోటారు వాహనాల సవరణ చట్టం వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి అమలు కానుంది. ఈ చట్టం కింద నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై భారీగా జరిమానాలు ఉండబోతున్నాయి. అలాగే అంబులెన్స్‌లకు వెంటనే దారి ఇవ్వకపోయినా వాహనదారులకు చిక్కులు తప్పవు. సదరు వాహనదారులపై కొరఢా ఝుళిపిస్తారు. మోటారు వాహన చట్టం నిబంధనలను అతిక్రమించే వారిపై ప్రస్తుతం ట్రాఫిక్ అధికారులు జరిమానాలు విధిస్తున్నప్పటికీ అవి నామమాత్రంగా ఉంటున్నాయి.

దీంతో వాహనదారులు యదేశ్ఛగా నిబంధనలకు తూట్లూ పొడుస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసి భారీగా జరిమానాలు విధించాలని తలపెట్టింది. ఇందులో భాగంగానే మోటారు వాహనాల చట్టానికి మరింతగా పదనుపెట్టింది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వాహనదారులు నిర్లక్షంగా ఉండడం, నిబంధనలను ఏ మాత్రం పాటించని కారణంగా పెద్దఎత్తున ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రతిరోదు రహదారులు రక్తసిక్తంగా మారుతున్నాయి.

ముఖంగా వాహనాలను అతి వేగంగా నడపడం, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, మద్యం మత్తులో వాహనాలను నడుపుతుడడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడుపుతుండడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపడం వంటి కారణాల వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవించడంతో పాటు పెద్దఎత్తున ప్రాణనష్టం జరుగుతోందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదానాల నివారణపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం నూతనంగా మోటారు వాహనాల సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. కాగా ఈ చట్టాన్ని రాష్ట్రంలో మరింత పకడ్బందిగా అమలు చేసేందుకు సంబంధిత అధికారులు సమాయత్తమవుతున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ట్రాఫిక్ విభాగం అధికారులు పలు కూడళ్ళలో కొత్త మోటారు వాహనం చట్టం కింద విధించనున్న ఫైన్లకు సంబంధించిన అంశాలను వివరిస్తూ పెద్దఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు నూతన మోటారు వాహన నిబంధనలను నిబంధనలను నిక్కచ్చిగా పాటించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. లేని పక్షంలో భారీ ఎత్తున జరిమానాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

కొత్త సవరణ చట్టం ప్రకారం వసూలు చేయనున్న పన్నుల వివరాలు

      రూల్స్                                      ప్రస్తుతం చట్టం            కొత్త చట్టం

1. సీటు బెల్టు పెట్టుకోకపోతే                        రూ. 100                    రూ. 1000
2. హెల్మెట్ లేకపోతే                               రూ.100                      రూ. 1000
3. అతి వేగం                                      రూ. 500                     రూ.5000
4. లైసెన్లు లేకపోతే                               రూ. 500                      రూ.5000
5. సెల్‌ఫోన్ డ్రైవింగ్                               రూ. 1000                    రూ. 5000
6. మద్యం సేవించి వాహనం నడిపితే             రూ. 2000                    రూ. 10,000
7. ఓవర్ లోడ్                                    రూ. 2000                    రూ. 20,000
8. పిల్లల డ్రైవింగ్ చేస్తుంటే ఇప్పటి వరకు ట్రాఫిక్ అధికారులు పట్టుకుని వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు. కొని కొత్త చట్టం ప్రకారం అలా మైనారిటీ తరని పిల్లలకు వాహనాలు ఇచ్చినట్లు అయితే రూ.25,000 ఫైన్‌ను విధించనున్నారు.

New Rules to Traffic Violations From September 1

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూల్స్ ఉల్లంఘిస్తే ఇక బాధుడే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: