కొత్త లుక్‌లో మిస్టర్ కూల్…ఫోటోలు వైరల్

  ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ క్రికెట్ కు కాస్తా విరామం ఇచ్చి… రెండు నెలలపాటు కశ్మీర్‌ లోయలో ప్యారాచ్యూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ హోదాలో విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల సైనిక విధులు పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన ధోనీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. తాజాగా ధోనీ ఓ వేడుకకు హాజరై వస్తూ జైపూర్‌ విమానాశ్రయంలో మీడియా కంట పడ్డాడు. తలకు నల్లటి క్లాత్ కట్టుకుని ఉన్న ధోనీని అక్కడ ఫోటో […] The post కొత్త లుక్‌లో మిస్టర్ కూల్… ఫోటోలు వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ క్రికెట్ కు కాస్తా విరామం ఇచ్చి… రెండు నెలలపాటు కశ్మీర్‌ లోయలో ప్యారాచ్యూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ హోదాలో విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల సైనిక విధులు పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన ధోనీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. తాజాగా ధోనీ ఓ వేడుకకు హాజరై వస్తూ జైపూర్‌ విమానాశ్రయంలో మీడియా కంట పడ్డాడు. తలకు నల్లటి క్లాత్ కట్టుకుని ఉన్న ధోనీని అక్కడ ఫోటో గ్రాఫర్లు క్లిక్ మనిపించారు. దీంతో కొత్త లుక్ లో ఉన్న ధోనీ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రపంచకప్ అనంతరం మిస్టర్ కూల్ రిటర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ భావించాడు.కానీ, ధోనీ తన రిటర్మెంట్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. వరల్డ్ కప్ తర్వాత టీమిండియా, విండీస్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, తనను విండీస్ టూర్ కు ఎంపిక చేయొద్దని, తనకు రెండు నెలలు విరామం కావాలంటూ బిసిసిఐని ధోనీ కోరిన విషయం తెలిసిందే.

MS Dhoni spotted in new look photos viral

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కొత్త లుక్‌లో మిస్టర్ కూల్… ఫోటోలు వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: