ఫీవర్ ఫ్యూతో క్యాన్సర్‌కు చెక్

‘ఫీవర్ ఫ్యూ’ పూల నుంచి సేకరించిన ఒక రసాయనం కేన్సర్‌కు విరుగుడుగా పనిచేస్తుందని అంటున్నారు బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ పువ్వును కొన్నిచోట్ల చాలాకాలంగా తలనొప్పి నివారణకు వాడుతూంటారు. కానీ పువ్వులోని పార్థీనియోలైడ్ అనే రసాయనం క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా కణాలపై ప్రభావం చూపుతున్నట్లు బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్ కణాల్లోని రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (రాస్) మోతాదులను పెంచడం ద్వారా ఈ రసాయనం పనిచేస్తున్నట్లు తెలిసింది. కేన్సర్ కణాల్లో సహజంగానే ఎక్కువగా ఉండే రాస్‌ను […] The post ఫీవర్ ఫ్యూతో క్యాన్సర్‌కు చెక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

‘ఫీవర్ ఫ్యూ’ పూల నుంచి సేకరించిన ఒక రసాయనం కేన్సర్‌కు విరుగుడుగా పనిచేస్తుందని అంటున్నారు బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ పువ్వును కొన్నిచోట్ల చాలాకాలంగా తలనొప్పి నివారణకు వాడుతూంటారు. కానీ పువ్వులోని పార్థీనియోలైడ్ అనే రసాయనం క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా కణాలపై ప్రభావం చూపుతున్నట్లు బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్ కణాల్లోని రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (రాస్) మోతాదులను పెంచడం ద్వారా ఈ రసాయనం పనిచేస్తున్నట్లు తెలిసింది.

కేన్సర్ కణాల్లో సహజంగానే ఎక్కువగా ఉండే రాస్‌ను మరింత పెంచడం ద్వారా ఈ రసాయనం కణాలను నాశనం చేస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాన్ ఫోసే తెలిపారు. మెడ్‌కెమ్ కామ్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. మరిన్ని జంతు, మానవ ప్రయోగాలు జరిగితే పార్టీనియోలైడ్‌కున్న లక్షణాలు నిర్ధారణ అవుతాయని తద్వారా దీన్ని కేన్సర్ చికిత్సకు మరో మందుగా వాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.

Feverfew Emulsion used to cure cancer

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫీవర్ ఫ్యూతో క్యాన్సర్‌కు చెక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.