2 రోజులు వాటర్‌ సప్లై బంద్‌…

పైపులైన్ల లీకేజీలతో 28,29 తేదీల్లో నీటిసరఫరాలో అంతరాయం హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ వద్ద కృష్ణానది నుంచి మంచినీటిని తరలిస్తున్న కృష్ణాపేస్1లో 2200 ఎంఎం పైపులైనుకు బారీ లీకేజీ ఏర్పడింది. ఈలీకేజీను అరికట్టేందుకు పైపులైనుకు మరమ్మత్తు పనులను జలమండలి చేపడుతుంది. ఇందుకోసం ఈనెల 28 బుధవారం ఉదయం 6గంటల నుంచి 29వతేదీ గురువారం సాయంత్రం 6గంటలవరకు సుమారు 36గంటలపాటు పలు ప్రాం తా ల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. అంతరాయం కలిగే ప్రాంతాలు…. అలియాబాద్, […] The post 2 రోజులు వాటర్‌ సప్లై బంద్‌… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పైపులైన్ల లీకేజీలతో 28,29 తేదీల్లో నీటిసరఫరాలో అంతరాయం

హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ వద్ద కృష్ణానది నుంచి మంచినీటిని తరలిస్తున్న కృష్ణాపేస్1లో 2200 ఎంఎం పైపులైనుకు బారీ లీకేజీ ఏర్పడింది. ఈలీకేజీను అరికట్టేందుకు పైపులైనుకు మరమ్మత్తు పనులను జలమండలి చేపడుతుంది. ఇందుకోసం ఈనెల 28 బుధవారం ఉదయం 6గంటల నుంచి 29వతేదీ గురువారం సాయంత్రం 6గంటలవరకు సుమారు 36గంటలపాటు పలు ప్రాం తా ల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

అంతరాయం కలిగే ప్రాంతాలు….

అలియాబాద్, మిరాలాం, కిషన్‌బాగ్, రియాసత్ నగర్, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, అస్మాన్‌ఘాడ్, చంచల్‌గూడ, యాకుత్‌పురా, మలక్‌పేట, ముసారాంబాగ్, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, హిందినగర్,నారాయణగూడ, అడిక్‌మెట్, శివం, చిలకలగూడ, దిల్‌షుక్‌నగర్ అదే విధంగా కృష్ణా పేస్2,3లకు 28వతేదీన ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వ రకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈప్రాంతాల్లో 29న సాయంత్రం 6 గంటలకు మంచినీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. బోజగుట్ట, మారేడుపల్లి, సైనిక్‌పురి ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

Hyderabad water supply shut down for next two days

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 2 రోజులు వాటర్‌ సప్లై బంద్‌… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: