2 నుంచి జెఇఇ మెయిన్‌కు దరఖాస్తులు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఎన్‌ఐటిల్లో ప్రవేశానికి, జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించేందుకు నిర్వహించే జాయి ంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్‌కు సెప్టెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నా రు. గత ఏడాది నుంచి రెండు సార్లు జెఇఇ మెయిన్ నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో జనవరి 6 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న జెఇఇ మెయిన్‌కు వచ్చే నెల 2 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఈ ఏడాది డిసెంబర్ […] The post 2 నుంచి జెఇఇ మెయిన్‌కు దరఖాస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఎన్‌ఐటిల్లో ప్రవేశానికి, జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించేందుకు నిర్వహించే జాయి ంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్‌కు సెప్టెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నా రు. గత ఏడాది నుంచి రెండు సార్లు జెఇఇ మెయిన్ నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో జనవరి 6 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న జెఇఇ మెయిన్‌కు వచ్చే నెల 2 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మే వరకు నిర్వహించనున్న వివిధ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. యుజిసి నెట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టి) ఎంబిఎ అడ్మిషన్ టెస్టు, సిఎస్‌ఐఆర్ యుజిసి నెట్, కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (సిమ్యాట్), గ్రాడ్యు యేట్ ఫార్మసి ఆప్టిట్యూడ్ టెస్టు (జిప్యాట్), ఆలిండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్టు, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ ఎంబిఎ, బి.ఇడి అడ్మిషన్ టెస్టు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్), జెఎన్‌యూ ఎంట్రెన్స్ టెస్టు, ఢిల్లీ వర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసింది. వీటిల్లో జెఇఇ, యుజిసి నెట్, సిఎస్‌ఐఆర్-యూజిసి నెట్ వంటి పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించింది. నీట్ మినహా మిగతా పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఎన్‌టిఎ పేర్కొంది. విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు దేశవ్యాప్తంగా పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో 4 వేల ప్రాక్టీస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్‌టిఎ వివరించింది. ఇవి సెప్టెంబర్ 1 నుంచి పని చేస్తాయని, ప్రతి శనివారం, ఆదివారం వీటిని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ ప్రాక్టీస్ కేంద్రాలలో కంప్యూటర్ పరీక్షలకు సంబంధించిన నిపుణులు అందుబాటులో ఉంటారని ఎన్‌టిఎ తెలిపింది.
ఎన్‌టిఎ నిర్వహించనున్న వివిధ పరీక్షల షెడ్యూల్
జెఇఇ మెయిన్- 1
పరీక్షా విధానం : కంప్యూటర్ బేస్డ్
దరఖాస్తుల స్వీకరణ : సెప్టెంబర్ 2 నుంచి 30 వరకు
పరీక్షా తేదీలు : 2020 జనవరి 6 నుంచి 11 వరకు
ఫలితాలు విడుదల : 31 జనవరి, 2020
జెఇఇ మెయిన్- 2
పరీక్షా విధానం : కంప్యూటర్ బేస్డ్
దరఖాస్తుల స్వీకరణ : 2020, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు
పరీక్షా తేదీలు : 2020 ఏప్రిల్ 3 నుంచి 9 వరకు
ఫలితాలు విడుదల : 30 ఏప్రిల్, 2020
నీట్(యుజి)
పరీక్షా విధానం : రాత పరీక్ష
దరఖాస్తుల స్వీకరణ : డిసెంబర్ 2 నుంచి 31 వరకు
పరీక్ష తేదీ : 2020 మే 3
ఫలితాలు విడుదల : 4 జూన్ 2020
యుజిసి నెట్ 1
పరీక్షా విధానం : కంప్యూటర్ బేస్డ్
దరఖాస్తుల స్వీకరణ : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు
పరీక్షా తేదీలు : డిసెంబర్ 2 నుంచి 6 వరకు
ఫలితాలు విడుదల : 31 డిసెంబర్, 2019
యుజిసి నెట్ 2
పరీక్షా విధానం : కంప్యూటర్ బేస్డ్
దరఖాస్తుల స్వీకరణ : వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 16 వరకు
పరీక్షా తేదీలు :వచ్చే ఏడాది జూన్ 15 నుంచి 50 వరకు
ఫలితాలు విడుదల : జూలై 5, 2020
సీమాట్ అండ్ జీపాట్
పరీక్షా విధానం : కంప్యూటర్ బేస్డ్
దరఖాస్తుల స్వీకరణ : నవంబర్ 1 నుంచి 30 వరకు
పరీక్షా తేదీ : 2020 జనవరి 28
ఫలితాలు విడుదల : 3 ఫిబ్రవరి, 2020
ఐఐఎఫ్‌టి
పరీక్షా విధానం : కంప్యూటర్ బేస్డ్
దరఖాస్తుల స్వీకరణ : సెప్టెంబర్ 2 నుంచి 25 వరకు
పరీక్షా తేదీ : డిసెంబర్ 1
ఫలితాలు విడుదల : డిసెంబర్ 11

application from 2 to jee main 2019

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 2 నుంచి జెఇఇ మెయిన్‌కు దరఖాస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: