పెరగనున్న బడ్జెట్ అంచనాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలు ఓటాన్‌తో చూస్తే కొంతమేర పెరగనున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు తుది రూపునిస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా 20 1920 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ రాబడి, వ్యయం అంచనాలతో బడ్జెట్‌ను రూ పొందిస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖలు వాటి బడ్జెట్ ప్రతిపాదనలను నేరుగా ఆన్‌లైన్‌లో ఆర్థిక శాఖకు పంపాయి. ప్రతిసారి మాదిరిగానే ఈసారి సాగునీటి రం గానికి ప్రాధాన్యతనివ్వనున్నారు. ఆ తరువాత స్థానంలో వ్యవసాయ శాఖకు […] The post పెరగనున్న బడ్జెట్ అంచనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలు ఓటాన్‌తో చూస్తే కొంతమేర పెరగనున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు తుది రూపునిస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా 20 1920 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ రాబడి, వ్యయం అంచనాలతో బడ్జెట్‌ను రూ పొందిస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖలు వాటి బడ్జెట్ ప్రతిపాదనలను నేరుగా ఆన్‌లైన్‌లో ఆర్థిక శాఖకు పంపాయి. ప్రతిసారి మాదిరిగానే ఈసారి సాగునీటి రం గానికి ప్రాధాన్యతనివ్వనున్నారు. ఆ తరువాత స్థానంలో వ్యవసాయ శాఖకు ఎ క్కువ మొత్తంలో నిధుల కేటాయింపులు ఉండనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రా జెక్టు దాదాపు పూర్తి కావడంతో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు పెంచనున్నారు. ఈ ఆరు నెలల కాలంలో వచ్చిన రాష్ట్ర రాబడి, చేసిన వ్యయం ఆధారంగా పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందిస్తున్నారు. 201920 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.1,82,017 కోట్లు కాగా, ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు, మూల ధన వ్యయం రూ.32,815 కోట్లుగా ఉంది.

అయితే పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఈ మొత్తం రూ. 1.90 లక్షల కోట్లు దాటుంతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అనుకున్నదానికంటే కొన్ని పథకాలకు ఎక్కువ మొత్తంలో వ్యయం అవుతుండటమే ఇందుకు కారణంగా తెలిసింది. అలాగే జిఎస్‌టి, ఎక్సైజ్ ఇతర ఆదాయాలు స్థిరంగా ఉండటంతో పాటు ప్రతినెలా పెరుగుతుండటంతో వార్షిక బడ్జెట్ అంచనాలు కొంతమేర పెరగనున్నాయి. జిఎస్‌టి ఆదాయం గతేడాది నాలుగు నెలల మొత్తంతో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలతో చూస్తే దాదాపు రూ.2 వేల కోట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఎక్సైజ్ ఆదాయం రూ. 12,190 కోట్లు చూపగా అక్టోబర్ నుంచి కొత్త పాలసీ ప్రారంభమవుతుంది. దీంతో ఓటాన్ అకౌంట్‌లో అంచనా వేసిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రైతుబంధు పథకానికి ఈ ఖరీఫ్‌లో రూ. 6990 కోట్లు విడుదల చేశారు. అయితే అంతకు మించి రైతులు లబ్ధిదారులు కావడంతో ఈ మొత్తం రూ.7300 కోట్లకు చేరుతుంది. రబీ వరకు డిజిటలైజేషన్ అయ్యే ఖాతాల సంఖ్య కూడా పెరుగుతున్నందున వారికి వర్తింపజేయాల్సి ఉంటుంది.

దీంతో రబీలో కనీసం రూ.8 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రైతుబీమాకు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో తక్కువ మొత్తంలో రూ. 650 కోట్లు కేటాయింపులు చూపారు. వాస్తవానికి రూ. 900 కోట్లకు పైగా ఇటీవల ప్రభుత్వం రైతుబీమా కోసం చెల్లించింది. రుణమాఫీ కోసం కూడా ముందుగా ఓటాన్ అకౌంట్‌లో రూ.6 వేల కోట్లు చూపగా, ఇప్పుడు రూ.7 వేల కోట్ల అంచనాలతో కేటాయింపులు చేయనున్నట్లు తెలిసింది. ఇక ఆసరా పెన్షన్ల కోసం ఓటాన్‌లో రూ. 12,067 కోట్లు చూపారు. అయితే కొత్త లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం కనీసంగా రూ. 2 వేల కోట్లు పెరుగుతుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖతో పాటు నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా నిధుల కేటాయింపు అంచనాలు పెరగనున్నాయి. సాగునీటి పారుదల ప్రాజెక్టుకు ఓటాన్‌లో రూ.22,500 కోట్లు ఉండగా ఇది మరో రూ.1000 కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా.

దేవాదుల, నాగర్జున సాగర్, కాంతనపల్లి, పాలమూరు రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్‌కు కేటాయింపులు పెంచి, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అలాగే కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు కూడా ఆర్ అండ్ బి శాఖ రూ. 600 కోట్ల వరకు బడ్జెట్ ప్రతిపాదనలు ఇచ్చింది. దీంతో పూర్తిస్థాయి బడ్జెట్‌లో పెద్ద మార్పులు లేకపోయినా బడ్జెట్ అంచనాల్లో స్వల్పమార్పులు ఉంటాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.

telangana budget session 2019

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పెరగనున్న బడ్జెట్ అంచనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: