టైటిల్ పోరుకు సింధు

బాసెల్ (స్విట్జర్లాండ్) : భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు చైనా స్టార్, మూడో సీడ్ చెన్ యుఫిను చిత్తు చేసింది. కాగా, సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా మూడో సారి కావడం విశేషం. ఇదిలావుండగా పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత ఆటగాడు బి.సాయి ప్రణీత్ పరాజయం చవిచూశాడు. మరోవైపు ఆదివారం జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు చిరకాల […] The post టైటిల్ పోరుకు సింధు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బాసెల్ (స్విట్జర్లాండ్) : భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు చైనా స్టార్, మూడో సీడ్ చెన్ యుఫిను చిత్తు చేసింది. కాగా, సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా మూడో సారి కావడం విశేషం. ఇదిలావుండగా పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత ఆటగాడు బి.సాయి ప్రణీత్ పరాజయం చవిచూశాడు. మరోవైపు ఆదివారం జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు చిరకాల ప్రత్యర్థి, జపాన్ స్టార్ ఒకుహారాతో తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో ఒకుహారా రచనాక్ ఇంతానాన్‌ను ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది. కాగా, శనివారం జరిగిన తొలి సెమీస్‌లో సింధు 217, 2114తో చైనా షట్లర్ చెన్ యుఫిను ఓడించింది. ప్రారంభం నుంచే సింధు ఆధిపత్యం చెలాయించింది. తనకు మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేక షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడింది. సింధు దూకుడును ప్రదర్శించడంతో మొదటి గేమ్‌లో చెన్ పూర్తిగా చేతులెత్తేసింది.

సింధుకు ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. అద్భుత ఆటను కనబరిచిన సింధు ప్రత్యర్థిని హడలెత్తించింది. సింధు జోరు ముందు చెన్ పూర్తిగా చతికిల పడింది. దీంతో తొలి సెట్‌ను సింధు అలవోకగా దక్కించుకుంది. కానీ, రెండో గేమ్‌లో మాత్రం సింధుకు కాస్త పోటీ ఎదురైంది. చెన్ ఈసారి పోరాట పటిమను కనబరిచింది. చూడచక్కని షాట్లతో సింధుపై ఎదురుదాడికి దిగింది. అంతేగాక ఒక దశలో గేమ్‌లో ఆధిక్యంలోకి కూడా దూసుకెళ్లింది. ఈ క్రమంలో సింధుకు కష్టాలు ఖాయమని అందరూ భావించారు. కానీ, కీలక సమయంలో భారత స్టార్ మళ్లీ పుంజుకుంది. ఏకాగ్రతతో ఆడుతూ ప్రత్యర్థి జోరుకు అడ్డకట్ట వేసింది. అంతేగాక క్రమంగా మళ్లీ పైచేయి సాధించింది. దీంతో పుంజుకోవడంతో చెన్ ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన సింధు 2114 తేడాతో సెట్‌ను గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది.
నేడు ఒకుహారాతో తుది పోరు
ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి జపాన్ ఆశాకిరణం నజోమి ఒకుహారాతో తలపడుతోంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఒకుహారా థాయిలాండ్ క్రీడాకారిణి రచనాక్‌పై విజయం సాధించింది. కాగా, 2017లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఒకుహారా చేతిలో సింధు ఓటమి పాలైంది. ఈసారి దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం సింధుకు ఏర్పడింది. ఇందులో ఎంత వరకు సఫలమవుతుందో చెప్పలేం. ఫైనల్ వరకు అలవోకగా దూసుకొచ్చే సింధుకు తుది మెట్టులో బోల్తా పడడం అలవాటుగా మారింది. ఈసారైనా ఫైనల్ ఫోబియా నుంచి బయట పడుతుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. 2017 ఫైనల్లో ఒకుహారా చేతిలో, కిందటి ఏడాది స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైంది. ఈ ఏడాది ఒకుహారాపై బదులు తీర్చుకునే అరుదైన అవకాశం సింధుకు దక్కింది. ఒత్తిడికి గురి కాకుండా తన సహాజ సిద్ధమైన ఆటను ఆడితే ఒకుహారాను ఓడించడం సింధుకు పెద్ద కష్టమేమి కాదు. కానీ, ఫైనల్లో ఓడే బలహీనత సింధుకు ప్రతికూలంగా మారింది. ఎన్నో టోర్నమెంట్‌లలో ఫైనల్‌కు చేరినా ఒత్తిడికి తట్టుకోలేక బోల్తా పడడం సింధుకు అలవాటుగా తయారైంది. దీంతో ఎన్నో టైటిల్స్‌ను సింధు కోల్పోక తప్పలేదు. కాగా, ఈసారి ఆ అపవాదు చెరిపేసుకుని ఫైనల్లో కూడా తనకు ఎదురులేదని నిరూపించాల్సిన బాధ్యత సింధుపై ఉంది. ఇందులో ఆమె సఫలం కావాలని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ముగిసిన ప్రణీత్ పోరాటం
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ఆశాకిరణం, తెలుగుతేజం సాయి ప్రణీత్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రణీత్ ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. సెమీస్‌లో టాప్ సీడ్ కెంటో 2113, 218 తేడాతో ప్రణీత్‌ను ఓడించాడు. ఇంతకుముందు భారత్‌కే చెందిన హెచ్.ఎస్. ప్రణయ్‌ను కూడా మొమోటా ఓడించిన విషయం తెలిసిందే. కాగా, సెమీస్ పోరులో ప్రణీత్ ఆశించిన స్థాయిలో ఆడలేక పోయింది. అగ్రశ్రేణి ఆటగాడు మొమోటా ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేక షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడ్డాడు. దూకుడుగా ఆడుతూ లక్షంగా అడుగులు వేశాడు. మొమోటా చెలరేగి ఆడడంతో ప్రణీత్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇదే సమయంలో వరుస తప్పిదాలకు కూడా పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన మొమోటా వరుసగా రెండు సెట్లు గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. ఇదిలావుండగా సెమీస్‌లో ఓడడంతో ప్రణీత్ కాంస్యంతోనే సరిపెట్టుకోక తప్పలేదు. పురుషుల సింగిల్స్‌లో భారత్ చివరి సారిగా 1983లో పతకం సాధించింది. ఆ టోర్నమెంట్‌లో దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పడుకొనే భారత్‌కు కాంస్య అందించాడు. ఆ తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత్‌కు పతకం అందించిన తొలి షట్లర్‌గా ప్రణీత్ నిలిచాడు.

PV Sindhu reached  final  In World Badminton Championship

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టైటిల్ పోరుకు సింధు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: