ఇషాంత్ మ్యాజిక్

అంటిగ్వా : వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. ఆతిథ్య విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 189/8తో శనివారం మూడో రోజు ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్‌ను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ అద్భుతంగా రాణించాడు. నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. […] The post ఇషాంత్ మ్యాజిక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అంటిగ్వా : వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. ఆతిథ్య విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 189/8తో శనివారం మూడో రోజు ఇన్నింగ్స్ చేపట్టిన విండీస్‌ను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ అద్భుతంగా రాణించాడు. నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన ఇషాంత్ 43 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మహ్మద్ షమి, జడేజాలు రెండేసి వికెట్లు తీసి తమవంతు పాత్ర పోషించారు.

ఇక విండీస్ జట్టులో రోస్టన్ ఛేజ్ (48), కెప్టెన్ జాసన్ హోల్డర్ (39), హెట్‌మెయిర్ (35)లు మాత్రమే రాణించారు. మిగతావారు విఫలం కావడంతో కరీబియన్ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా క్రమం తప్పకుండా వికెట్లను తీస్తూ విండీస్‌ను కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ఇషాంత్ అద్భుతంగా రాణించాడు. తన అనుభవాన్ని ఉపయోగిస్తూ వికెట్ల పంట పండించాడు. ఇషాంత్‌ను ఎదుర్కొవడంలో విండీస్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. షమి కూడా తనవంతు పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు కీలకమైన 75 పరుగులు ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా తాజా సమాచారం లభించే సమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.

India Vs West Indies 3rd Test match Highlights

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇషాంత్ మ్యాజిక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: