అరుణ్ అష్ట విశిష్టతలు

విద్యార్థి నేతగా జైట్లీ ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం పోరాడారు. జైట్లీ విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. ఈ దశలోనే ఆయన ఎబివిపితో అనుబంధం పెంచుకున్నారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎబివిపి నేతగా కీలక పాత్ర పోషించారు. జైట్లీ ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడే దేశంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ సమయంలో ఎమర్జెన్సీ ప్రతిఘటనలో జైట్లీ కీలక వ్యక్తిగా మారారు. నిరసనోద్యమాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో […] The post అరుణ్ అష్ట విశిష్టతలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

  1. విద్యార్థి నేతగా జైట్లీ ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం పోరాడారు. జైట్లీ విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. ఈ దశలోనే ఆయన ఎబివిపితో అనుబంధం పెంచుకున్నారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎబివిపి నేతగా కీలక పాత్ర పోషించారు. జైట్లీ ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడే దేశంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ సమయంలో ఎమర్జెన్సీ ప్రతిఘటనలో జైట్లీ కీలక వ్యక్తిగా మారారు. నిరసనోద్యమాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో అరెస్టు అయిన జైట్లీ రెండేళ్లు జైలు పాలయ్యారు. నిరంకుశత్వాన్ని సహించేది లేదనే ఈ తత్వమే ఆయనను నాయకుడి స్థాయికి చేర్చింది.

2. జైట్లీకి న్యాయశాస్త్రం అంటే మక్కువ. రాజకీయాలంటే ప్రాణం. ఈ రెండింటిని మేళవించుకుని జైట్లీ ముందుకు సాగారు. లా పట్టభద్రుడు అయిన తరువాత జైట్లీ ప్రముఖ లాయర్‌గా, ఫలప్రద ప్రాక్టిస్‌ను దక్కించుకున్నారు. అయితే ఆయన మనసంతా రాజకీయాలపై ఉండేది. న్యాయవాద వృత్తిలో రాణించిన జైట్లీ కేవలం 37 సంవత్సరాల వయస్సులోనే 1989లో విపి సింగ్ ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్ అయ్యారు. లాయర్‌గా పేరుమోసిన జైట్లీ బోఫోర్స్ విషయంలో రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా చట్టపరమైన కేసును రూపొందించే బాధ్యతలు తీసుకున్నారు. లాయర్‌గా తన సమర్థతను సన్నిహిత రాజకీయ నేతల కేసులు వాదించడానికి వినియోగించుకున్నారు. వారిని చట్టపరమైన క్లిష్టతల నుంచి గట్టెక్కించారు. న్యాయ చట్టపరమైన అంశాలలో ఆయనకు ఉన్న అపార అనుభవం చట్టాల రూపకల్పనలో ఉపయోగపడుతూ వచ్చింది. సరైన సమగ్రమైన చట్టాలను తీసుకువచ్చే ప్రక్రియలో ఆయన ఆరితేరారు. ఇది ఇటీవలి జమ్మూ కశ్మీర్ చట్టాల మార్పిడి వరకూ కొనసాగింది. ప్రత్యర్థులను చట్టపరమైన చక్రబంధంలోకి నెట్టడంలో ఆయన న్యాయవాద వృత్తి అనుభవం బాగా కలిసివచ్చింది.

3. కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జైట్లీ బిజెపి తరఫున ప్రచార సారథిగా బాధ్యతలు తీసుకున్నారు. దీనితో దేశంలో ప్రాంతీయ భౌగోళిక పరిమితులను దాటి బిజెపి పలు రాష్ట్రాలలో పాగా వేసింది. ఆంగ్లం, హిందీలలో అనర్గళంగా ప్రసగించే దిట్టగా పేరు తెచ్చుకోవడంతో టీవీ న్యూస్ ఛానళ్ల చర్చలు వాదోపవాదాలలో జైట్లీ కీలకం అయ్యారు. సముచిత భావజాలం ముద్రితం చేస్తూ ప్రజల మస్తిష్కంలో మెదులుతూ వచ్చారు. న్యాయస్థానాలలో వాదోపవాదాల స్థాయిలోనే చర్చాగోష్టుల దశలోనూ సరైన పట్టువిడుపులతో సమర్థుడైన వక్తగా మారారు. అవసరమైన దూకుడు, మృధుత్వాన్ని సరైన రీతిలో మేళవించుకున్నారు. పార్టీ పట్ల ఆదరణను పెంచుకున్నారు.

4. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బిజెపి ప్రాబల్యం పెంచడంలో కీలకంగా వ్యవహరించారు. యుపిఎపై అవినీతి ఆరోపణలతో ఎగువసభలో బిజెపి తరపున ఎండగట్టడంలో ప్రధాన బాధ్యత వహించారు. ఇందుకు ఆయన ప్రసంగ పాటవం, అంతకు మిం చి ఆయనకే సొంతం అయిన వివిధ విషయాల ఆవిష్కరణలు కలిసి వచ్చాయి. అత్యంత తీవ్ర అంశాలను కూడా ఎక్కడా ఆవేశానికి తావులేకుండా ప్రత్యర్థులను కూడా హత్తుకునేలా చేస్తూ ఆయన వివరణ నచ్చేలా చేసే శక్తియుక్తులను సంతరించుకున్నారు. స్కామ్‌ల వ్యవహారాలతో యుపిఎ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారే దశలో , ప్రజల అసంతృప్తి తీవ్రం అవుతున్నప్పుడు, బిజెపి ప్రాధాన్యత పెరగడం, దీనితో పాటు జాతీయ ప్రత్యామ్నాయం బిజెపినే అనే వాతావరణం కల్పించడంలో జైట్లీ పాత్ర కీలకం అయింది.

5. జైట్లీ ప్రజాజీవితంలో మరో ము ఖ్యమైన అంశం మోడీతో ఆయనకు ఉన్న సన్నిహితత్వం. ఇద్ద రూ మంచి స్నేహితులు. 1990 చివర్లో పార్టీలో ఇద్దరూ కలిసి కీలక బాధ్యతలే నిర్వర్తించారు. మోడీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో ఉన్నప్పుడు జైట్లీ కల్పించిన పరిస్థితులతోనే మోడీ గుజరాత్ రాజకీయాలకు వెళ్లి సిఎం అయ్యారు. గుజరా త్ అల్లర్ల తరువాత తీవ్రస్థాయి విమర్శలను మోడీ ఎదుర్కొంటున్న సమయంలో జైట్లీ ఆయనకు మద్దతుగా నిలిచారు. చా లా ఏళ్ల పాటు మోడీ కోర్టు కేసులు, కమిషన్ల దర్యాప్తులు, దర్యాప్తు బృందాల ఆరాలతో గడపాల్సి వచ్చిన దశలో జైట్లీ సన్నిహిత సలహాదారుగా మారారు. ఇద్దరు కూడా సీనియర్ నేత అద్వానీనే రాజకీయ గురువుగా భావిస్తూ వచ్చారు. పార్టీ బలోపేతంలో ఆయన పాత్ర కీలకమని గౌరవభావం వ్యక్తం చేశారు.

6. ఎన్నికల ఘట్టాల సమయంలో జైట్లీనే పార్టీ సందే శం ప్రజల వద్దకు చేరే కీలక బాధ్యతను తీసుకున్నారు. 2014, 2019లో ఆయన పార్టీ మేనిఫెస్టోలు, జాతీయ స్థాయిలో సంధించాల్సిన నినాదాలనురూపొందించారు. ప్రజాస్వామిక, ఎన్నికల రాజకీయాలలో ప్రజల వద్దకు చేరే భాష, వారి ని ఆకట్టుకునే తీరు అత్యంత కీలకం గా మారుతుంది. ఇది అత్యంత చతురమైన సమీకరణ అవుతుంది. జైట్లీ తన పదాలతో పార్టీ విజయానికి బాటలు పరిచారు. 2019 ఎన్నికల దశలో ఆయన తీవ్ర అనారోగ్యం కారణంతో రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించలేకపొయ్యారు. అయితే తెరవెనుక ఉంటూనే ఆయన అందరి కన్నా ముందుగానే పార్టీని ప్రజల వద్దకు చేర్చే దిశలో పనిచేశారు.

7. రాజకీయాలు , సంవిధానాలను రెండింటిని సమ్మిళితం చేసుకుని సమర్థవంతంగా వ్యవహరించగలిగిన అరుదైన బిజెపి నేతగా జైట్లీ నిలిచారు. రాజకీయాలలో దిట్ట అన్పించుకునే వారు పాలసీల విషయంలో విఫలం చెందుతూ చివరికి నేతలుగా కనుమరుగవుతారు. అయితే దీనికి అతీతంగా రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన నేతల్లో జైట్లీ ప్రముఖంగా నిలిచారు. ఆర్థిక మంత్రిగా ఆయన కీలక మార్పులు చేర్పులు చేపట్టారు. ప్రత్యేకించి జిఎస్‌టి రూపకల్పన కీలకంగా మారింది. అప్పటివరకూ పెండింగ్‌లో ఉంటూ వచ్చిన పలు ఆర్థిక సంస్కరణలు , బ్యాంకింగ్ రంగంలో ప్రక్షాళనలను ఆయన ఆర్థిక మంత్రిగా చేపట్టారు. ఇన్‌సాల్వేన్సీ, దివాలా కేసులపై వ్యవహరించాల్సిన నియమావళి బిల్లుల ఆమోదం ఆయన హయాంలో జరిగింది. భారతీయ ఆర్థిక వ్యవస్థకు నిర్మాణాత్మక మార్పుల దిశలో సాగిన ఈ పరిణామాలు జైట్లీ రూపకల్పనతోనే సాగాయి. జిఎస్‌టి ముందస్తు కసరత్తుగా పలు దఫాల సంప్రదింపులు, ఏకాభిప్రాయసాధన వంటి దశలు సాగాయి. రాష్ట్రాలను ఒప్పించడం ముఖ్యమైన అంశంగా మారింది. జైట్లీకున్న వినిమయ ప్రతిభా పాటవం అసాధ్యాన్ని సాధ్యం చేసింది.

8. ఢిల్లీ రాజకీయ వేదిక నుంచి అత్యంత ఆత్మీయ వ్యక్తిగా జైట్లీ పేరు నిలుస్తుంది. ఆయన పార్టీలకు అతీతంగా అందరివాడు. రాజకీయ ప్రత్యర్థులను కూ డా ఆయన ఆదరించారు. పార్టీలో జూనియర్లను కూడా గౌరవించారు. తోటి న్యాయవాదులను, వ్యాపార ప్రముఖులను, లోథీ గార్డెన్‌లోని వాకింగ్ గ్రూప్ వారు మొదలుకుని దైనందిన రాజకీయ రంగంలో ఎదురయ్యే జర్నలిస్టులు, డాక్టర్లు, అధికారులు అందరితోనూ కలివిడిగా ముచ్చటించేవారు.

Special Focus On Arun Jaitley Political Career

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అరుణ్ అష్ట విశిష్టతలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: