కొత్త మద్యం పాలసీపై కసరత్తు షురూ

  వచ్చే నెలాఖరుతో ముగియనున్న ఆబ్కారీ సంవత్సరం లైసెన్స్ ఫీజులు, దరఖాస్తులు పెరిగే అవకాశం రూరల్ జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు వరంగల్ రూరల్ : ప్రభుత్వం కొత్త మద్యం పాలసీపై కసరత్తు షురూ చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల ఎక్సైజ్‌పాలసీ వచ్చే నెలాఖరుతో(సెప్టెంబర్ 30) ముగియనున్న నేపథ్యంలో కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వానికి ఆదాయం వనరుగా ఉన్న మద్యం పాలసీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న […] The post కొత్త మద్యం పాలసీపై కసరత్తు షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వచ్చే నెలాఖరుతో ముగియనున్న ఆబ్కారీ సంవత్సరం
లైసెన్స్ ఫీజులు, దరఖాస్తులు పెరిగే అవకాశం
రూరల్ జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

వరంగల్ రూరల్ : ప్రభుత్వం కొత్త మద్యం పాలసీపై కసరత్తు షురూ చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల ఎక్సైజ్‌పాలసీ వచ్చే నెలాఖరుతో(సెప్టెంబర్ 30) ముగియనున్న నేపథ్యంలో కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వానికి ఆదాయం వనరుగా ఉన్న మద్యం పాలసీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను మరింత పెంచడంతో పాటు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఆబ్కారీ సంవత్సరం ముగింపు దశలో కసరత్తు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

కొత్త మద్యం దుకాణాల కేటాయింపుల కోసం దరఖాస్తులను ఆహ్వానించేందుకు వీలుగా మద్యం పాలసీలో మార్పులు తీసుకువచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో మారిన రూపురేఖలకనుగుణంగా మద్యం పాలసీలో మార్పులు చేయనున్నట్లు తెలిసింది. రూరల్ జిల్లాలో కొత్తగా వర్ధన్నపేట మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా ఏర్పడింది. పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలను విలీనం చేశారు. ఈ క్రమంలో మద్యం పాలసీ ప్రభావం ఎలా ఉంటుందోనని వ్యాపారులు ఎదురుచూస్తున్నారు.

లైసెన్స్ ఫీజులు పెరిగే అవకాశం..?
కొత్త మద్యం పాలసీలో లైసెన్స్ ఫీజులు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఏడాదికోసారి కొత్త లైసెన్స్ ఇచ్చే విధానం ఉండేది. వేలం ద్వారా ఎక్కువ ధర కోడ్ చేసిన వారికి దుకాణాలను కేటాయించేవారు. ఈ పద్ధతిలో చాలా మంది వ్యాపారులు ముందే రింగ్ అయి తాము అనుకున్న చోట అనుకున్న రేటుకు దుకాణాలను దక్కించుకునేవారు. దీనివల్ల గొడవలు జరిగేవి, ఆదాయానికి గండి పడేది. ఇది గ్రహించిన ప్రభుత్వం 2016 నుండి మద్యం పాలసీలో సమూల మార్పులు చేశారు. దరఖాస్తుకు లక్ష చొప్పున నిర్ణయించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండేళ్లకు లైసెన్స్ ఫీజులు వసూలు చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వరంగల్ రూరల్ జిల్లాలో 2017లో నిర్వహించిన టెండర్లలో 58 దుకాణాలకు 1524 దరఖాస్తులు వచ్చాయి.

దరఖాస్తు ఫీజుల ద్వారానే ప్రభుత్వానికి రూ.152.24 కోట్ల ఆధాయం లభించింది. దరఖాస్తులను అందరి సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసి దుకాణాలను కేటాయించారు. పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 22 మద్యం దుకాణాలు, రెండు బార్‌లు, నర్సంపేట ఎక్సైజ్ పరిధిలో 22 దుకాణాలు, ఆరుబార్‌లు, వర్ధన్నపేట పరిధిలో 14 దుకాణాలు ప్రస్తుతం నడస్తున్నాయి. వీటి ద్వారా ఇప్పటి వరకు రికార్డుస్థాయిలో రూ.750 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. మద్యం దుకాణాల్లో సిట్టింగ్‌లకు అనుమతినివ్వడం, గ్రామాల్లో బెల్ట్‌షాపులు అనధికారికంగా నిర్వహిస్తుండడం, అసెంబ్లీ ఎన్నికలు మొదలు మొన్నటి ప్రాదేశిక ఎన్నికలు వరుసగా రావడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా లభించింది.

పారదర్శకంగానే కేటాయింపులు..
దుకాణాల లైసెన్స్ కేటాయింపుల్లో ఈసారి కూడా పారదర్శకంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో జనాభాను బట్టి లైసెన్స్ ఫీజును నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు ఫీజును లక్ష నుండి ఆపైకి పెంచుతారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడడం గ్రామాలను విలీనం చేయడంతో దుకాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లో దుకాణాల కోసం ఈసారి విపరీతంగా పోటీ పెరిగే అవకాశం ఉంది. మరి కొద్దిరోజుల్లో ఎక్సైజ్‌పాలసీ ప్రకటిస్తే గాని వ్యాపారులు ఏయే దుకాణాలకు పోటీపడుతారు, ఎంత ఆదాయం జిల్లా నుండి రావొచ్చని అంచనా వేయవచ్చు.

Government is focusing on the new Liquor policy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కొత్త మద్యం పాలసీపై కసరత్తు షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: