మాంద్యానికి విరుగుడు

        కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు ఉన్నట్టుండి ప్రకటించిన ఆర్థిక స్వస్థత నిర్ణయాల జాబితా ఒక మినీ బడ్జెట్‌ను తలపించింది. మాంద్యం కోరల్లో చిక్కుకున్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి దోహదపడగలవని భావిస్తున్న ఈ నిర్ణయాలు ముంచుకు రాగల ముప్పును ముందుగానే పసిగట్టి దానిని నివారించడానికి ఉద్దేశించినవని భావించాలి. ఇప్పటికే 300 డీలర్ షిప్పుల మూతకు, 2 లక్షల మంది ఉద్యోగులు వీధిన పడడానికి దారి తీసిన […] The post మాంద్యానికి విరుగుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

        కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు ఉన్నట్టుండి ప్రకటించిన ఆర్థిక స్వస్థత నిర్ణయాల జాబితా ఒక మినీ బడ్జెట్‌ను తలపించింది. మాంద్యం కోరల్లో చిక్కుకున్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి దోహదపడగలవని భావిస్తున్న ఈ నిర్ణయాలు ముంచుకు రాగల ముప్పును ముందుగానే పసిగట్టి దానిని నివారించడానికి ఉద్దేశించినవని భావించాలి. ఇప్పటికే 300 డీలర్ షిప్పుల మూతకు, 2 లక్షల మంది ఉద్యోగులు వీధిన పడడానికి దారి తీసిన కార్ల తయారీ రంగం అస్వస్థత నుంచి తిరిగి కోలుకోడానికి ఆమె పలు చర్యలను ప్రకటించారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టెర్ల పై గత బడ్జెట్‌లో విధించిన సూపర్ సర్‌చార్జీని ఉపసంహరించుకున్నారు. అటువంటి 32 చర్యలను ఏక కాలంలో ప్రకటించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి దృఢ సంకల్పం వహించారు.

గత జులై 5 తేదీన ప్రకటించిన బడ్జెట్ నుంచి 7 శాతం దిగజారి 5 లక్షల కోట్ల రూపాయల మేరకు విలువ కరిగి తరిగిపోయిన స్టాక్ మార్కెట్ నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు ప్రకటించిన సూపర్ సర్‌చార్జీల రద్దుతో తిరిగి పుంజుకున్న సూచనలు కనిపించాయి. డాలర్‌తో రూపాయి విలువ పతనం 8 మాసాల తర్వాత ఆగింది. శుక్రవారం నాడు మళ్లీ పుంజుకొని డాలర్‌కు 71.66 రూపాయిల వద్ద నిలిచింది. స్టార్టప్ కంపెనీల మీద బడ్జెట్‌లో విధించిన ఏంజెల్ ట్యాక్స్‌కు స్వప్తి చెప్పడమూ మంచి పరిణామాలకు దారి తీసే అవకాశముంది. బ్యాంకులకు ఒకే సారి తక్షణమే 70 వేల కోట్ల రూపాయల ద్రవ్యతను కల్పించబోవడం శుభసూచకం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నగదు మద్దతు కల్పించే చర్యలను కూడా సీతారామన్ ప్రకటించారు.

ఆర్‌బిఐ రెపో రేటులో సడలింపు ఇచ్చిన ప్రతిసారీ అది వడ్డీ రేట్ల తగ్గింపు రూపంలో నేరుగా రుణ గ్రహీతలకు అందేలా చూడాలని తీసుకున్న నిర్ణయం గణనీయమైనది. ఇంతవరకు బ్యాంకులు ఇందుకు అడ్డు తగులుతూ వచ్చాయి. ఇక ముందు అలా జరగకుండా రిజర్వు బ్యాంకు రేటు తగ్గించినప్పుడల్లా అది రుణ గ్రహీతలకు మేలు చేసేలా చర్యలు తీసుకోదలిచారు. వస్తు, సేవల పన్ను చెల్లింపుదార్లకు ఇంత వరకు బకాయి పడిన రిఫండ్‌ను వెంటనే విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం పలు కంపెనీలకు, వ్యాపార సంస్థలకు నగదు లభ్యతను పెంచి మార్కెట్‌కు ఉద్దీపన కల్పించే అవకాశమున్నది. కార్ల పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వ శాఖలు కొత్త వాహనాల కొనుగోలుపై గల నిషేధాన్ని తొలగించాలని తీసుకున్న నిర్ణయం ఆ రంగం కోలుకునేలా చేస్తుంది.

ఇప్పటినుంచి వచ్చే మార్చి వరకు ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే కొత్త కార్లపై తరుగు ప్రయోజనాన్ని 15 శాతానికి బదులు 30 శాతం చేయడం కూడా ప్రయోజనకరమైనది. కొత్త కంపెనీలు, స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేయడం వల్ల వాటికి పెద్ద ఎత్తున పెట్టుబడి సమకూరే అవకాశమున్నది. రాబడి పన్ను అధికారుల వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి కేంద్రీకృత కంప్యూటరైజ్డ్ నోటీసులు, సమన్లు, ఉత్తర్వుల విధానాన్ని నెలకొల్పదలచడం హర్షించదగినది. అలాగే కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత నిబంధనలను ఉల్లంఘించడాన్ని ఇక నుంచి క్రిమినల్ నేరంగా కాకుండా సివిల్ అపరాధంగా పరిగణించబోవడం కూడా ఆ రంగానికి ఊరట కలిగిస్తుంది. బ్యాంకుల మొండి బకాయీలు గత ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో మళ్లీ పెరిగాయి. దీనితో వాటి రుణ వితరణ దెబ్బతిన్నది. ఇప్పుడు ఒకే సారిగా 70 వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను ఆదుకోదలచడం వల్ల రుణ వితరణ మళ్లీ పుంజుకునే అవకాశముంది.

ఒకేసారిగా అనేక చర్యల ద్వారా కార్పొరేట్ రంగాన్ని ఆదుకోదలచడం వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశాలు పెరుగుతాయి. కాని అందుకనుగుణంగా కార్పొరేట్ రంగం కూడా స్పందించవలసి ఉంటుంది. సూపర్ సర్‌చార్జీ వంటి నిర్ణయాలకు ఆగ్రహించిన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ రంగం మన స్టాక్ మార్కెట్ నుంచి ఉన్నపళంగా ఈ ఒక్క నెలలోనే 12,105.30 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నది. గత నెలలో 12,418.73 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నది. సూపర్ సర్‌చార్జీ, స్టార్టప్‌ల ఏంజెల్ ట్యాక్స్ ఉపసంహరణ వల్ల ఖజానాకు 1400 కోట్ల రూపాయల మేరకు రాబడి నష్టం జరిగినా కార్పొరేట్ రంగం భారీగా నిధుల ఉపసంహరణ ద్వారా తీసుకున్న ప్రతీకార చర్యల వల్ల స్టాక్ మార్కెట్‌కు జరిగిన హాని తొలగిపోయే అవకాశాలున్నాయి. కార్పొరేట్ ఆగ్రహం ప్రభుత్వాన్ని ఎంతగా వణికింపజేసిందో దీనిని బట్టి అవగతమవుతున్నది.

FPIs super rich tax relief applies to income

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాంద్యానికి విరుగుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: