రోడ్డు ప్రమాదంలో సోదరులు దుర్మరణం

  మాదన్న : వేగంగా బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను ఓ బొగ్గు లారీ ఢీ కొట్టి వారి తలపై నుంచి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలగిరి బాలానగర్ లంబాడీ తాండకు చెందిన విజయ్ (28,) శ్రీను (27)లు వరుసకు ఇద్దరు సోదరులు. సైదాబాద్‌లో నివాసం ఉంటూ సెంట్రింగ్ వృత్తి కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి […] The post రోడ్డు ప్రమాదంలో సోదరులు దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మాదన్న : వేగంగా బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను ఓ బొగ్గు లారీ ఢీ కొట్టి వారి తలపై నుంచి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలగిరి బాలానగర్ లంబాడీ తాండకు చెందిన విజయ్ (28,) శ్రీను (27)లు వరుసకు ఇద్దరు సోదరులు. సైదాబాద్‌లో నివాసం ఉంటూ సెంట్రింగ్ వృత్తి కొనసాగిస్తున్నారు.

శుక్రవారం రాత్రి ఎల్‌బినగర్ నుండి చంపాపేట్‌కు వచ్చారు. అక్కడి నుంచి సైదాబాద్‌కు వెళ్లే వైపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టడంతో రోడ్డుపై పడ్డారు. వారి తల మీదు నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే చనిపోయారు. స్థానికులు లారీ డ్రైవర్ ఈదయ్యను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసి మృత దేహాన్ని శవ పరీక్షకై ఉస్మానియా హాస్పటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు.

Brothers killed in Road Accident

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో సోదరులు దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: