ఐపిఓల బాటలో స్టార్టప్స్

  రేపు మార్కెట్లోకి రానున్న అల్ఫాలాజిక్ టెక్‌సైస్ లిమిటెడ్ ముంబయి: దేశీయ స్టార్టప్స్ పబ్లిక్ ఇష్యూ(ఐపిఓ)ల బాట పట్టాయి. బెంగళూరు, పుణె, ముంబయి, హైదరాబాద్ తదితర నగరాలకు చెందిన దాదాపు 200 స్టార్టప్‌లు ప్రస్తుతం ఐపిఓలకు ముస్త్తాబయ్యాయి. దాదాపు వెయ్యి కోట్ల నిధులను సేకరించాలన్నది వీటి లక్షం. వీటిలో భాగంగా అన్ని అనుమతులతో పుణెకు చెందిన టెక్నాలజీ కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ సపోర్టింగ్ సంస్థ ‘అల్ఫాలాజిక్ టెక్‌సైస్ లిమిటెడ్’ సోమవారం ఇష్యూకు వస్తోంది. ముంబైకి చెందిన వైద్య […] The post ఐపిఓల బాటలో స్టార్టప్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రేపు మార్కెట్లోకి రానున్న అల్ఫాలాజిక్ టెక్‌సైస్ లిమిటెడ్

ముంబయి: దేశీయ స్టార్టప్స్ పబ్లిక్ ఇష్యూ(ఐపిఓ)ల బాట పట్టాయి. బెంగళూరు, పుణె, ముంబయి, హైదరాబాద్ తదితర నగరాలకు చెందిన దాదాపు 200 స్టార్టప్‌లు ప్రస్తుతం ఐపిఓలకు ముస్త్తాబయ్యాయి. దాదాపు వెయ్యి కోట్ల నిధులను సేకరించాలన్నది వీటి లక్షం. వీటిలో భాగంగా అన్ని అనుమతులతో పుణెకు చెందిన టెక్నాలజీ కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ సపోర్టింగ్ సంస్థ ‘అల్ఫాలాజిక్ టెక్‌సైస్ లిమిటెడ్’ సోమవారం ఇష్యూకు వస్తోంది. ముంబైకి చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ ట్రాన్స్‌పాక్ట్ ఎంటర్‌ప్రైసెస్ లిమిటెడ్ ఐపిఓకు కూడా అనుమతి లభించింది. వీటి దరఖాస్తులు అనుమతి పొందాయని బిఎస్‌ఇ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఒక్కో స్టార్టప్స్ తొలి దశలో రూ. 5 కోట్ల నిధులను సేకరిస్తాయని ఆయన తెలియజేశారు.

లిస్టింగ్‌కు దరఖాస్తు చేసిన స్టార్టప్స్ కార్యకలాపాలు, లావాదేవీలు, మేనేజిమెంట్ ఇతరత్రా అంశాలను పరిశీలించిన తర్వాత ఐపిఓకు అనుమతి లభిస్తుంది కనుక దీనికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. దేశీయ స్టార్టప్స్ పరిశ్రమలో ఐపిఓ అనేది కొత్త ట్రెండేనని చెప్పాలి. ఎందుకంటే స్టార్టప్స్‌కు కార్యకలాపాల విస్తరణకు నిధులు కావాలంటే ఇప్పటిదాకా వెంచర్ క్యాపిటలిస్టు, సంస్థాగత పెట్టుబడిదారు వైపు చూడాలి వచ్చేది. దీతో స్టార్టప్‌లలో మెజారిటీ వాటాలు వారి చేతుల్లోకి వెళ్లడం, వారి నియంత్రణలో పని చేయాల్సి రావడం జరుగుతుండేది. బిఎస్‌ఇ లిస్టింగ్‌తో ఈ ఇబ్బందులు తొలగిపోతాయని స్టార్టప్ వర్గాలు చెప్తున్నాయి.

Alphalogic Techsys postpones IPO opening to Aug 26

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐపిఓల బాటలో స్టార్టప్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: