‘ఒకే దేశం.. ఒకే పన్ను’ సాకారం చేసిన జైట్లీ

  నిజమైన సంస్కరణ వాది, గొప్ప దేశ భక్తుడ్ని కోల్పోయాం మాజీ ఆర్థిక మంత్రికి కార్పొరేట్ ప్రపంచం ఘన నివాళి న్యూఢిల్లీ: ఒకే దేశమంతటా ఒకే పన్ను విఢానం అమలు చేయాలన్న బృహత్తర లక్షంతో పన్నుల రంగంలో విప్లవంగా భావించే వస్తు సేవల పన్ను( జిఎస్‌టి) విధానాన్ని 2017 జూలైలో ప్రారంభించినప్పుడు అది విజయవంతం కావడంపై ఆర్థిక నిపుణులతో పాటుగా వాణిజ్య వర్గాలు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న […] The post ‘ఒకే దేశం.. ఒకే పన్ను’ సాకారం చేసిన జైట్లీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిజమైన సంస్కరణ వాది, గొప్ప దేశ భక్తుడ్ని కోల్పోయాం
మాజీ ఆర్థిక మంత్రికి కార్పొరేట్ ప్రపంచం ఘన నివాళి

న్యూఢిల్లీ: ఒకే దేశమంతటా ఒకే పన్ను విఢానం అమలు చేయాలన్న బృహత్తర లక్షంతో పన్నుల రంగంలో విప్లవంగా భావించే వస్తు సేవల పన్ను( జిఎస్‌టి) విధానాన్ని 2017 జూలైలో ప్రారంభించినప్పుడు అది విజయవంతం కావడంపై ఆర్థిక నిపుణులతో పాటుగా వాణిజ్య వర్గాలు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ ఎంతో చాకచ్యంగా దీన్ని అమలు చేసి శభాష్ అనిపించుకున్నారు. జిఎస్‌టి అమలు కావడానికి ముందు ఒక వస్తువు తయారీదారుడి నుంచి వినియోగదారుడి వద్దకు చేరే దాకా రకరకాల పన్నులు ఉండేవి. దీంతో పన్నుల వ్యవస్థ గందరగోళంగా ఉండేది. పన్నుల వ్యవస్థను ఏకీకృతం చేయడానికి అప్పటి యుపిఎ ప్రభుత్వం హయాంలో ప్రయత్నం చేసినా అడుగు ముందుకు పడలేదు. 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం కొలువు దీరడంతో జిఎస్‌టిని ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ మొదలైంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఈ బాధ్యతను అప్పగించారు.

ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే తాటిపైకి తేవడంలో సఫలీకృతం అయ్యారు. దీంతో అన్ని పన్నుల వ్యవస్థ రద్దయి జిఎస్‌టి అమలులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటుగా సరకుల రవాణా కూడా సులభతరమైంది. చెక్‌పోస్టుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు లారీ యజమానులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్‌లైన్ ద్వారా అనుమతులు తీసుకోవడంతో రవాణా వేగవంతం అయింది. ఫలితంగా సరకు ప్రయాణ సమయం సగానికి సగం తగ్గింది. మరో వైపు గత రెండేళ్ల కాలంలో వివిధ వర్గాల సూచనలు, సలహాల మేరకు జిఎస్‌టి శ్లాబులలో కూడా మార్పులు చేశారు. మొదట్లో చాలా శ్లాబులు ఉండగా ఇప్పుడు నాలుగు శ్లాబులు మాత్రమే ఉన్నాయి.

రాబోయే రోజుల్లో ఇవి రెండు, మూడు శ్లాబులకు పరిమితం చేసే అవకాశముందని గతంలోనే జైట్లీ ప్రకటించారు. ఆయన అనుకున్నట్లుగానే ప్రభుత్వ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. అయితే జిఎస్‌టికి ఆద్యుడైన జైట్లీ ఇప్పుడు మన మధ్య లేకుండా పోయారు. తీవ్ర అస్వస్థతో కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన జైట్లీ శనివారం మధ్యాహ్నం కన్ను మూశారు. శనివారం కన్ను మూసిన బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి మృతి పట్ల కార్పొరేట్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గొప్ప వక్త, సమర్థుడైన పార్లమెంటేరియన్, ప్రజల సంక్షేమమే లక్షంగా పని చేసిన నేత, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కాగల సామర్థం కలిగిన అరుణ్ జైట్లీ దూరదృష్టి, ప్రగతిశీల ఆలోచనలు నవభారత నిర్మాణంలో ఉత్ప్రేరకాలని అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ఒక ట్వీట్‌లో అభివర్ణించారు.

జైట్లీ మృతితో దేశం అత్యుత్తమ రాజకీయ నాయకుడిని, ఒక గొప్ప న్యాయ కోవిదుడిని కోల్పోయిందని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అన్నారు. ఎలాంటి సమస్యలనైనా అవలీలగా పరిష్కరించగల సత్తా ఆయనకే సొంతం అని కూడా అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జైట్లీకి సెల్యూట్ చేస్తున్నానని మహింద్రాగ్రూపు చైర్మన్ ఆనంద్ మహింద్రా అంటూ, ఆయన ఆత్మ శాంతికి భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాన్నారు. జైట్లీ మృతితో దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని హెచ్‌డిఎఫ్‌సి చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. ఇటీవలి కాలంలో దేశంలోనే అతి పెద్ద పన్ను సంస్కరణ అయిన జిఎస్‌టిని అమలు చేసిన నేతగా ఆయన పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన అన్నారు.

జైట్లీ మృతి పార్టీకే కాకుండా దేశానికే తీరని లోటని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. జైట్లీ నిజమైన సంస్కరణ వాది, ఆర్థిక సరళీకరణ కోసం గట్టిగా కృషి చేసిన వ్యక్తి అని సిఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ అభివర్ణించారు. దేశం కోసం ఇంకా ఎంతో చేయాల్సిన తరుణంలో ఇంత చిన్న వయసులోనే జైట్లీ జీవితం ముగియడం తనకు ఎంతో బాధగా ఉందని బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ అన్నారు. అరుణ్ జైట్లీ మృతి దేశానికి తీరని నష్టమని, ఒక గర్వించదగ్గ బిడ్డను, దేశ భక్తుడిని, భారత దేశ శక్తి సామర్థాల పట్ల అపారమైన నమ్మకం కలిగిన వ్యక్తిని దేశం కోల్పోయిందని ఫిక్కీ అవయక్షుడు సందీప్ సోమానీ అన్నారు.

Arun Jaitley on implementation of GST

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘ఒకే దేశం.. ఒకే పన్ను’ సాకారం చేసిన జైట్లీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: