పని విలువ

    సాగర్, ఇవాళ పనిమనిషి రాలేదు. నాకు చాలా పని వుంది. నువ్వు కొంచెం నీ బుక్స్, బట్టలు సర్ది పెట్టు కో. తమ్ముడు కూడా సరిగ్గా పెట్టుకునేట్లు చూడు వంటింట్లోంచి అమ్మ చెప్పిన మాటలకి.. ఆ.. అని స మాధానమైతే ఇచ్చాడు కానీ సాగర్‌కి ఏ పనీ చె య్యాలనిపించలేదు. పుస్తకాల సంచీ ఒక వైపు విసిరేశాడు. స్కూల్ యూ నిఫాం మార్చి ఇంకో పక్కకి విసిరేశాడు. తమ్ముడేం చేస్తున్నాడో పట్టించుకోలేదు. వీధిలోకెళ్ళాడు ఆడుకోవటానికి. […] The post పని విలువ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

సాగర్, ఇవాళ పనిమనిషి రాలేదు. నాకు చాలా పని వుంది. నువ్వు కొంచెం నీ బుక్స్, బట్టలు సర్ది పెట్టు కో. తమ్ముడు కూడా సరిగ్గా పెట్టుకునేట్లు చూడు వంటింట్లోంచి అమ్మ చెప్పిన మాటలకి.. ఆ.. అని స మాధానమైతే ఇచ్చాడు కానీ సాగర్‌కి ఏ పనీ చె య్యాలనిపించలేదు.
పుస్తకాల సంచీ ఒక వైపు విసిరేశాడు. స్కూల్ యూ నిఫాం మార్చి ఇంకో పక్కకి విసిరేశాడు. తమ్ముడేం చేస్తున్నాడో పట్టించుకోలేదు. వీధిలోకెళ్ళాడు ఆడుకోవటానికి.
సాగర్ తమ్ముడు శ్రీకర్ అమ్మ మాట విని పుస్తకాల సంచీ అలమరలో పెట్టబోయాడు. చిన్నవాడు కదా. అందలేదు. అక్కడే గోడకానించి పెట్టాడు. స్కూల్ యూనిఫాం నిక్కర్ విప్పాడు కానీ షర్టు విప్పటం చేతకాలేదు. షర్టులోంచి చేతులు తియ్యటం రాక ఏడుస్తూ అమ్మ దగ్గరకెళ్ళాడు. అమ్మ వాళ్ళకి పాలు కలుపుతూ, అన్నని అడక్కపోయినావురా అన్నది. సిగ్గుతో ముడుచుకు పోయాడు శ్రీకర్ ఛీ…అన్నతో నా అంటూ. శ్రీకర్ చిన్నప్పటి నుంచీ అంతే. నిక్కర్ విప్పటానికి సిగ్గుపడడుకానీ ఎవరన్నా చూస్తుంటే షర్టు విప్పటానికి మాత్రం చాలా సిగ్గు పడతాడు. ఒక్కోసారి షర్టు వుంటే చాలు నిక్కరు లేకుండానే బయటకెళ్ళి ఆడుకుంటాడు.
సాగర్ పక్కింట్లోనే వున్న వికాస్‌ని ఆడుకోవటానికి పిలవటానికి వెళ్ళాడు. సాగర్ వెళ్ళేసరికి వికాస్ చీ పురుతో ఇల్లు వూడుస్తున్నాడు. వాళ్ళ చెల్లెలు ప్రియ వాళ్ళమ్మ కడిగి పెట్టిన గిన్నెలు గుడ్డతో తుడుస్తోంది.
“అదేమిట్రా నువ్వు వూడుస్తున్నావు ఇల్లు” ఆశ్చర్యం గా అడిగాడు సాగర్.
“ఇవాళ పనిమనిషి రాలేదు రా. అమ్మ ఒక్కతీ ఆఫీసు నుంచి వచ్చి అంతపనీ చేసుకోలేదు. అందుకే కొంచెం సహాయం చేస్తున్నాం” అన్నాడు వికాస్.
“అయినా ఆడపిల్లల్లాగా ఇల్లు వూడవటమేమిటి?” సాగర్ ఇంకా ఆశ్చర్యం నుంచీ తేరుకోలేదు.
“పనికి ఆడపిల్లలు చేసేది, మగపిల్లలు చేసేదీ అనే తేడా ఏమీ వుండదు సాగర్. మనకి చేతయి, మనం చెయ్యగలిగిన ఏ పని అయినా చెయ్యవచ్చు. అయి నా అన్ని పనులూ చెయ్యటం వచ్చి వుండటం మం చిదని మా అమ్మ ఎప్పుడూ చెబుతుంది. ఇలాంటి అవసరాలు ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు ఇబ్బంది పడకుండా మన పని మనం చేసుకోవచ్చు. అమ్మకి ఎప్పుడన్నా ఒంట్లో బాగుండకపోతే మనం సాయం చేస్తే అమ్మకి కొంచెం రెస్టు దొరుకుతుందికదా.. అం తేకాదు. మనం నేర్చుకున్న పని మనకెప్పటికైనా ఉపయోగపడుతుంది. ఇవాళ్టికి నేను ఆడుకోవటానికి రాలేనులే. రేపు ఆడుకుందాం.. సరేనా” సాగర్ సమాధానం కోసం చూడకుండా తన పని తను చేసుకోసాగాడు వికాస్.
వికాస్ ఇంటినుంచి తిరిగి వస్తూ ఆలోచనలో పడ్డా డు సాగర్. అమ్మకూడా ఆఫీసుకెళ్ళి వస్తుంది. అయి నా కూడా తనకి చిన్న పనే చెప్పింది. తన పుస్తకాలు, బట్టలు సరిగ్గా పెట్టుకోమని. ఇల్లు చిమ్మమని చెప్పలేదు..గిన్నెలు తుడవమని చెప్పలేదు. తను వినకుం డా తన మానాన తను ఆడుకోవటానికి వచ్చేశాడు. వికాస్ వాళ్ళ అమ్మకి సహాయం చెయ్యటానికి ఇల్లుకూడా చిమ్ముతున్నాడు. అమ్మ బాధ పడ్డదేమో.. తను పుస్తకాలు, బట్టలు అలా పడేసి వచ్చినందుకు. ఓపిక లేకపోయినా తను సర్దుతుంది. తమ్ముడికి చొక్కా విప్పుకోవటం కూడా చేతకాదు. అమ్మని విసిగిస్తున్నాడేమో. వెళ్ళి అమ్మకి సహాయం చెయ్యాలి అనుకుంటూ గబగబా ఇంటివైపు నడిచాడు సాగర్.

పిఎస్ఎమ్. లక్ష్మి

Chinna Pillala Neethi Kathalu Cheppandi

 

Hard Work Stories in Telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పని విలువ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.