ఉంటే ఉండు.. పోతే పో: యడ్డీకి డెడ్లీ వార్నింగ్ !

బెంగళూరు: కేబినెట్ విస్తరణపై బిజెపి ఎమ్మెల్యేలలో రగులుతున్న అసంతృప్తిని చల్లార్చడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు పార్టీ అధిష్టానం నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. మంత్రి పదవులను ఆశించి భంగపడిన వారితో పాటు మంత్రిత్వశాఖల కేటాయింపు ఇంకా జరగకపోవడంపై పార్టీలో రగులుతున్న అసంతృప్తిని వెంటనే చల్లార్చాలని, లేని పక్షలంలో అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ తాజాగా ఎన్నికలకు వెళ్లాలని బిజెపి అధిష్టానం యడియూరప్పను ఆదేశించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీలకు ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఎన్నికలు […] The post ఉంటే ఉండు.. పోతే పో: యడ్డీకి డెడ్లీ వార్నింగ్ ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు: కేబినెట్ విస్తరణపై బిజెపి ఎమ్మెల్యేలలో రగులుతున్న అసంతృప్తిని చల్లార్చడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు పార్టీ అధిష్టానం నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. మంత్రి పదవులను ఆశించి భంగపడిన వారితో పాటు మంత్రిత్వశాఖల కేటాయింపు ఇంకా జరగకపోవడంపై పార్టీలో రగులుతున్న అసంతృప్తిని వెంటనే చల్లార్చాలని, లేని పక్షలంలో అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ తాజాగా ఎన్నికలకు వెళ్లాలని బిజెపి అధిష్టానం యడియూరప్పను ఆదేశించినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీలకు ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయని, ఒకవేళ అసమ్మతిని చల్లార్చలేని పక్షంలో అసెంబ్లీని రద్దు చేసి వాటితో పాటే కర్నాటక అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించవచ్చని పార్టీ అధిష్టానం యడియూరప్పకు సూచించినట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. మంత్రిత్వ శాఖల కేటాయింపుపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో చర్చించేందుకు గురువారం ఢిల్లీ వెళ్లిన యడియూరప్పకు నిరాశ ఎదురైంది. యడియూరప్పను కలుసుకునేందుకు వారిద్దరూ నిరాకరించినట్లు సమాచారం. అంతర్గత సమస్యలను రాష్ట్ర స్థాయిలోనే చర్చించుకోవాలని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మంత్రిపదవులపై ఏర్పడిన అసమ్మతి కారణంగా కర్నాటకలో బిజెపి ప్రతిష్ట దెబ్బతింటోందని కూడా పార్టీ అధిష్టానం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనర్హత వేటు పొందిన 17 మంది ఎమ్మెల్యేలు తమకు సుప్రీంకోర్టులో ఊరట లభించిన పక్షంలో కీలకమైన మంత్రిత్వశాఖలను తమకే అప్పగించాలని కూడా యడియూరప్పపై ఒత్తిడి చేస్తున్నారు.

Settle portfolios or go to polls, BJP warns BSY, CM BS Yediyurappa is struggling to allot portfolios and distruntlement among party MLAs on the Cabinet expansion.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉంటే ఉండు.. పోతే పో: యడ్డీకి డెడ్లీ వార్నింగ్ ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: