మోడల్ హత్య…. ఓలా క్యాబ్ డ్రైవర్ అరెస్టు

  బెంగళూరు: కర్నాటకలోని కెంప్‌గౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు సమీపంలో మోడల్ ను హత్య చేసిన కేసులో క్యాబ్ డ్రైవర్ ను అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన మోడల్‌ను డబ్బుల కోసం ఓలా క్యాబ్ డ్రైవర్ హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోల్‌కతాకు చెందిన పూజా సింగ్(32) అనే అమ్మాయి మోడలింగ్‌తో పాటు ఈవెంట్ మెనేజర్‌గా పని చేస్తోంది. బెంగళూరు, ముంబయి, ఢిల్లీలో పలు ఈవెంట్లకు మేనేజర్‌గా చేస్తోంది. జులై 30న కోల్‌కతా నుంచి […] The post మోడల్ హత్య…. ఓలా క్యాబ్ డ్రైవర్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెంగళూరు: కర్నాటకలోని కెంప్‌గౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు సమీపంలో మోడల్ ను హత్య చేసిన కేసులో క్యాబ్ డ్రైవర్ ను అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన మోడల్‌ను డబ్బుల కోసం ఓలా క్యాబ్ డ్రైవర్ హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోల్‌కతాకు చెందిన పూజా సింగ్(32) అనే అమ్మాయి మోడలింగ్‌తో పాటు ఈవెంట్ మెనేజర్‌గా పని చేస్తోంది. బెంగళూరు, ముంబయి, ఢిల్లీలో పలు ఈవెంట్లకు మేనేజర్‌గా చేస్తోంది. జులై 30న కోల్‌కతా నుంచి పూజా బెంగళూరుకు వచ్చింది. ఓలా క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు వెళ్తోంది. మధ్యలో ఎయిర్ పోర్టు దాటగానే ఓలా డ్రైవర్‌ను తన కారును దారి మళ్లించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమెపై రాడ్‌తో దాడి చేశాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఆమె బ్యాగ్‌లో ఉన్న డబ్బులతో పాటు రెండు మొబైల్ ఫోన్లను తీసుకున్నాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను కత్తితో పలుమార్లు పొడిచి అనంతరం తలపై రాయితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు వెళ్లిపోయాడు. కాదా యరప్పనహలి గ్రామస్థులకు మృతదేహాం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. చనిపోయిన మహిళ  టైటాన్ వాచ్, జీన్స్ పాయింట్ ధరించి ఉంది.

ఆమె మీద ఉన్న దుస్తువులు చినిగిపోయి ఉన్నాయి. ఆమె దగ్గర హ్యాండ్ బ్యాంగ్ లేకపోవడంతో ఆధారాలు లభించలేదు.  ఢిల్లీ, కోల్‌కతాలో పోలీసులు టీమ్‌లు విచారణ చేపట్టాయి. ఢిల్లీ, కోల్‌కతా అదృశ్యమైన మహిళల గురించి వాకబు చేశారు. ఓ పత్రికలో ఈవెంట్ మేనేజర్ పూజ అదృశ్యమైందని గుర్తించారు. ఆమె ఫోన్ చివర కాల్ ఎవరు చేసిందని ఆరా తీయగా ఓలా క్యాబ్ బుక్ చేసినట్టు గుర్తించారు. ఓలా కంపెనీ నుంచి సమాచారం తీసుకొని ఓలా క్యాబ్ డ్రైవర్‌ను నాగేష్ అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిందితుడు తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో నాగేష్‌ను రిమాండ్‌కు తరలించారు. దీంతో ఓలా కస్టమర్స్ ఎవరో నమ్మాలో అర్థం కావడంలేదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 

 

OLA Cab Driver Arrest in Model Murder Case

The post మోడల్ హత్య…. ఓలా క్యాబ్ డ్రైవర్ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: