హక్కుల కోసం ఐఎఎస్‌కు గుడ్‌బై

న్యూఢిల్లీ: ఆయనో యువ ఐఎఎస్ అధికారి. గత ఏడాది కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా-నాగర్ హవేలీలో జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న కాలంలో కేరళలో వరదలు సంభవించినపుడు హుటాహుటిన అక్కడకు వెళ్లిపోయారు. ఒక అజ్ఞాత వ్యక్తిలా సహాయ కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు. ఆయనొక జిల్లా కలెక్టర్ అన్న విషయం ఎవరికీ తెలియదు. మరో ఐఎఎస్ అధికారి గుర్తుపట్టడంతో ఆయన ఎవరో వెలుగుచూసింది. అంతటి నిజాయితీపరుడైన అ అధికారి పేరు కన్నన్ గోపీనాథన్. 2012 బ్యాచ్‌కు చెందిన కన్నన్ ప్రస్తుతం దాద్రా-నాగర్ […] The post హక్కుల కోసం ఐఎఎస్‌కు గుడ్‌బై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: ఆయనో యువ ఐఎఎస్ అధికారి. గత ఏడాది కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా-నాగర్ హవేలీలో జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న కాలంలో కేరళలో వరదలు సంభవించినపుడు హుటాహుటిన అక్కడకు వెళ్లిపోయారు. ఒక అజ్ఞాత వ్యక్తిలా సహాయ కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు. ఆయనొక జిల్లా కలెక్టర్ అన్న విషయం ఎవరికీ తెలియదు. మరో ఐఎఎస్ అధికారి గుర్తుపట్టడంతో ఆయన ఎవరో వెలుగుచూసింది. అంతటి నిజాయితీపరుడైన అ అధికారి పేరు కన్నన్ గోపీనాథన్. 2012 బ్యాచ్‌కు చెందిన కన్నన్ ప్రస్తుతం దాద్రా-నాగర్ హవేలీ ప్రభుత్వంలో విద్యుత్, పట్టణాభివృద్ధి, వ్యవసాయ శాఖల ఇన్‌చార్జ్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

అయితే ఈ నెల 21న ఆయన తన సర్వీసుకు రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. తనను ఐఎఎస్ నుంచి రిలీవ్ చేయవలసిందిగా కోరుతూ కేంద్ర హోం కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. భావ వ్యక్తీకరణకు తావు లేని చోట తాను ఇక పనిచేయలేనని, తనకు తన భావ వ్యక్తీకరణ హక్కు కావాలంటూ రాజీనామాకు ముందు ఆయన చేసిన ట్వీట్లు ఆయన రాజీనామా వెనుక కారణాలను చెప్పకనే చెబుతున్నాయి. తన ఆలోచనలను, భావాలను పంచుకోలేని పరిస్థితిలో తాను ఉన్నానని, ఒక ప్రాంత ప్రజలంతా(కశ్మీరు) తమ ప్రాథమిక హక్కులను కోల్పోయిన పరిస్థితులలో కూడా తాను తన భావాలను వ్యక్తం చేయలేని నిస్సహాయ పరిస్థితి ఉన్నానని, దేశం యావత్తు ఏదో సుదూర దేశంలో జరిగిన పరిణామంగా మౌనంగా ఉండడం కూడా తనను అసంతృప్తికి గురిచేస్తోందని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయారట.

ఆగస్టు 20న ఒక ట్వీట్ పోస్ట్ చేస్తూ సివిల్ సర్వీసెస్‌లో చేరడమంటే తోటి ప్రజల హక్కులను, స్వేచ్ఛను పరిరక్షించే అవకాశంగా ఒకప్పుడు భావించాను అన్న ఆయన వ్యాఖ్యలు ఆయన అంతర్మథనాన్ని సూచిస్తున్నాయి. ఆగస్టు 23న పోస్ట్ చేసిన మరో ట్వీట్‌లో హాంగ్‌కాంగ్‌లోని తాజా పరిణామాలను ఆయన ప్రస్తావించారు. నేరస్తుల అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్ ప్రజలు పెద్దఎత్తున చేసిన నిరసనలను ప్రస్తావిస్తూ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం లేని చోట సంపదకు విలువ లేదని హాంగ్‌కాంగ్ అర్థం చేసుకుంటోంది అన్న వ్యాఖ్యలు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులకు ఆయన చూపుతున్న ప్రాధాన్యతను సూచిస్తున్నాయి.

రాజీనామా అనంతరం ఆయన ఒక మీడియా సంస్థతతో మాట్లాడుతూ నాకు నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సంపూర్ణంగా కావాలి. ఇతరుల హక్కులను కాపాడగలనన్న విశ్వాసంతో సరీసులలో చేరాను. కాని, ఇక్కడ నా గొంతునే వినిపించలేకపోతున్నాను. నా రాజీనామా మళ్లీ నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను నాకు అందచేస్తుంది అని కన్నన్ గోపీనాథన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Kannan IAS resigns from service, I wanted my freedom of expression back: Kannan IAS resigns from service, The officer from Dadra and Nagar Haveli grabbed headlines when he went to help in Kerala floods 2018.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హక్కుల కోసం ఐఎఎస్‌కు గుడ్‌బై appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: