భవనం కుప్పకూలి ఇద్దరు మృతి…

ముంబై: అక్రమంగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన మహారాష్ట్రలోని భివాండిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు భవనానికి పగుళ్లు వస్తున్నాయని మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన అధికారులు భవనంలో ఉంటున్న 22 కుటుంబాలను రాత్రికి రాత్రే ఖాళీ చేయించారు. అయితే కొందరు తమ నివాసాల్లో వస్తువులు మరిచిపోయామని ఐదుగురు వ్యక్తులు భవనంలోకి వెళ్లారు. అదే సమయంలోనే భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల […] The post భవనం కుప్పకూలి ఇద్దరు మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: అక్రమంగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన మహారాష్ట్రలోని భివాండిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు భవనానికి పగుళ్లు వస్తున్నాయని మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన అధికారులు భవనంలో ఉంటున్న 22 కుటుంబాలను రాత్రికి రాత్రే ఖాళీ చేయించారు.

అయితే కొందరు తమ నివాసాల్లో వస్తువులు మరిచిపోయామని ఐదుగురు వ్యక్తులు భవనంలోకి వెళ్లారు. అదే సమయంలోనే భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ బిల్డింగ్ ను 8 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యజమాని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొన్నారు.

building collapse in Bhiwandi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భవనం కుప్పకూలి ఇద్దరు మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: