పాలమూరు జరూరు

మన తెలంగాణ/హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలో ఆయకట్టుకు నీరు ఇవ్వాలని గడువు విధించారు. శుక్రవారం సాయంత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై ఇఎన్‌సి మురళీధర్, చీఫ్ ఇంజనీర్ రమేష్‌లతో సిఎం సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి, నీళ్లు ఇచ్చే స్థాయికి తీసుకువచ్చినట్లుగా, పాలమూరు రంగారెడ్డిని సైతం పూర్తిచేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లో మిగిలిన పనులు పూర్తిచేస్తే […] The post పాలమూరు జరూరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలో ఆయకట్టుకు నీరు ఇవ్వాలని గడువు విధించారు. శుక్రవారం సాయంత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై ఇఎన్‌సి మురళీధర్, చీఫ్ ఇంజనీర్ రమేష్‌లతో సిఎం సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి, నీళ్లు ఇచ్చే స్థాయికి తీసుకువచ్చినట్లుగా, పాలమూరు రంగారెడ్డిని సైతం పూర్తిచేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లో మిగిలిన పనులు పూర్తిచేస్తే జిల్లాలోని సగానికి పైగా వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని, మిగతా సగం భూములకు పాలమూరు ఎత్తిపోతలతో నీరు ఇవ్వాలని ఆదేశించారు. పనుల పురోగతిని తెలుసుకునేందుకు సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులాగే మూడు షిప్టులా పనిచేసి, పనులు పూర్తిచేయాలన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న పనులు, భవిష్యత్తులో జరగాల్సిన పనులపై సిఎం అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లు, కాలువల పనులను సమాంతరంగా చేపట్టాలని చెప్పారు. సగ ఇప్పటికే పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కాగా, వచ్చే రెండేళ్లలోపు మొత్తం ఆయకట్టుకు నీరు ఇచ్చేలా ప్రాధాన్యతలు నిర్ణయించుకొని, పనులు పూర్తిచేయాలని సూచించారు. 12 లక్షల పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయకట్టుతో పాటు 4 లక్షల ఎకరాల డిండి ఎత్తిపోతల ఆయకట్టు సైతం ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. మొత్తం దక్షిణ తెలంగాణలో కీలకమైన, భారీ ప్రాజెక్టు కావడంతో అలసత్వం ప్రదర్శించవద్దని చెబుతూనే, నిధులకు ఢోకా లేదని, తానే నేరుగా పనులు, నిధుల పర్యవేక్షణ చేస్తానని సిఎం భరోసానిచ్చారు.

works speed up in palamuru ethipothala project

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాలమూరు జరూరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: