హరితవనాన్నిటూరిజం క్షేత్రంగా మారుస్తాం

  ఆదిలాబాద్ : మావల హరితవనాన్ని పెద్ద అటవీ టూరిజం క్షేత్రంగా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, దేవదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శు క్రవారం మావలలోని హరితవనంలో బో ర్టింగ్, అడ్వెంజర్ సైకిలింగ్‌ను ప్రారంభించి స్మృతి వనంలో పిసిసిఎఫ్ శోభ, డిఎఫ్‌వో వి నోద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, జిల్లా కలెక్టర్ దిద్యవేవరాజన్, ఎ మ్మెల్యే జోగురామన్న, రాథోడ్ బాపురావ్, జిల్లా ఎస్పి విష్ణు […] The post హరితవనాన్నిటూరిజం క్షేత్రంగా మారుస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్ : మావల హరితవనాన్ని పెద్ద అటవీ టూరిజం క్షేత్రంగా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, దేవదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శు క్రవారం మావలలోని హరితవనంలో బో ర్టింగ్, అడ్వెంజర్ సైకిలింగ్‌ను ప్రారంభించి స్మృతి వనంలో పిసిసిఎఫ్ శోభ, డిఎఫ్‌వో వి నోద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, జిల్లా కలెక్టర్ దిద్యవేవరాజన్, ఎ మ్మెల్యే జోగురామన్న, రాథోడ్ బాపురావ్, జిల్లా ఎస్పి విష్ణు ఎస్ వారియర్‌లతో కలిసి మొక్కను నాటారు. అనంతరం హరితవనం లో అడవి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రితో పాటు ప్రజాప్రతినిధులు అధికారులకు పులమొక్కలు అంది ంచి శాలువలతో సత్కరించారు.

పిసిసిఎఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన శోభను ఎమ్మెల్యే జోగు రామ న్న శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మావల సర్పంచ్ దొగ్గలి ప్రమీల, ఎంపిపి ఈశ్వరీ, జడ్పీటిసి నల్ల వనిత, ఎఫ్‌డీవో చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మనీష, మాజీ ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, ఉమ్మడి జిల్లా డిఎఫ్‌వోలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ జీవనకోటికి జీవనాదారం చెట్లే అని అలాంటి చెట్ల పెంపకం కోసం సిఎం కేసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మనల్ని భాగస్వాములను చేయడం అదృష్టంగా బావించాలన్నారు. మున్ముందు మన అటవీ పరిధి ఎక్కువగా ఉన్నందున పులులు వచ్చే అవకాశం ఉందన్నారు. సిఎం కెసిఆర్ అడవులను కాపాడటానికి కఠినమైన చట్టాలను తీసుకువచ్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు.

ఉమ్మడి జిల్లాలోని జలపాతాలు, పుణ్యక్షేత్రాలను అభివృద్ధితో పాటు నేరడిగోండ కుంటాల జలపాతం వద్ద పర్యాటకులకు అనుగుణంగా సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతు సీఎం కెసిఆర్ తీసుకున్న సహోసోపేత నిర్ణయం పర్యావరణ పరిరక్షణ భూమాతకు పూర్వ వైభవానిన తేవడానికి హరితహారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వెయ్యి ఎకరాలతో ఈ మావల పార్కును అభివృద్ధి చేయడం జరిగిందని మరో 3 వేల ఎకరాలలో అడవులను అభివృద్ధ్ది చేయడం జరుగుతుందన్నారు.

దానికి 3 కోట్లతో ప్రహరీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు సక్రమంగా రాకపోవడంతో అనేక పార్కులు, పర్యాటక ప్రాంతాల అభివృద్ది పనులు ముమ్మరంగా చేపట్టలేకపోతున్నామని అన్నారు. పీసీసీఎఫ్ శోభ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదంతో పాటు ప్రకృతి అందాలను పరిచయం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 129 పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

జంగల్ బడవో జంగల్ బచవో బాగంగా ఏర్పాటు చేయనున్న 129 పార్కుల్లో 59 అర్బన్ పార్కులు కాగా మిగిత 70 పార్కులు అడవులను పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అధికారుల సహకారంతోనే మావల హరితవనం ఎంతో అభివృద్ది చెందిందని ఇప్పటి వరకు లక్షల మంది పర్యాటకులు ఇక్కడి వచ్చారని తెలిపారు.

Harith vanam is Field of Tourism

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హరితవనాన్నిటూరిజం క్షేత్రంగా మారుస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: