వెరైటీ స్నాక్స్

  క్రీమ్ చీజ్ రోల్స్ కావాల్సినవి: స్ప్రింగ్ రోల్ షీట్స్ 45, పన్నీర్ 150 గ్రా॥, తరిగిన ఉల్లిపాయ1, తరిగిన పచ్చిమిర్చి1, థిక్ క్రీమ్2 పెద్ద చెమ్చాలు, వెన్న రెండు చెమ్చాలు, ఉప్పు తగినంత. తయారీ విధానం: పన్నీర్, క్రీమ్, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని బాగా కలపండి. స్రింగ్ రోల్ షీట్స్‌లో పన్నీర్ ఫిల్లింగ్ నింపి రోల్ చేయండి. పై నుంచి బటర్ లేయర్ వేసి 180 డిగ్రీ వేడి ఓవెన్‌లో 78 నిమిషాలు బేక్ చేయండి. […] The post వెరైటీ స్నాక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్రీమ్ చీజ్ రోల్స్
కావాల్సినవి: స్ప్రింగ్ రోల్ షీట్స్ 45, పన్నీర్ 150 గ్రా॥, తరిగిన ఉల్లిపాయ1, తరిగిన పచ్చిమిర్చి1, థిక్ క్రీమ్2 పెద్ద చెమ్చాలు, వెన్న రెండు చెమ్చాలు, ఉప్పు తగినంత.
తయారీ విధానం: పన్నీర్, క్రీమ్, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని బాగా కలపండి. స్రింగ్ రోల్ షీట్స్‌లో పన్నీర్ ఫిల్లింగ్ నింపి రోల్ చేయండి. పై నుంచి బటర్ లేయర్ వేసి 180 డిగ్రీ వేడి ఓవెన్‌లో 78 నిమిషాలు బేక్ చేయండి. తిప్పేసి బటర్ వేసి 34 నిమిషాలు బేక్ చేయండి.

పాలక్ కార్న్ టిక్కి
కావాల్సినవి: తరిగిన పాలకూర 1కప్పు, మొక్కజొన్న గింజలు 1/4 కప్పు, అటుకులు1/2 కప్పు, పెసరపప్పు 1కప్పు, తరిగిన ఉల్లిపాయ1, తరిగిన పచ్చిమిర్చి1/2, గరం మసాలా1/4 చిన్న చెమ్చా, వెన్న1పెద్ద చెమ్చా, నూనెవేయించడానికి, ఉప్పు తగినంత.
తయారీ విధానం: కడాయిలో వెన్న వేడి చేసి ఉల్లిపాయలు వేయించండి. ఇందులో పాలకూర, టొమాటో, కార్న్ గింజలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మూత పెట్టి ౩4 నిమిషాలు ఉడికించండి. పెసరపప్పును నీళ్లలో 2౩ గంటలు నానబెట్టి స్టీమ్ చేయండి. అటుకులను జల్లెడలో వేసి బాగా కడిగి 1015 నిమిషాలు ఉంచండి. స్టీమ్ చేసిన పప్పులో అటుకులు కలిపి పచ్చిమిర్చి, ఉప్పు వేసి పిండి కలపండి. దీన్ని సమాన భాగాలుగా విడదీసి పల్చగా చేసి మధ్యలో పాలకూర మిశ్రమాన్ని నింపి మూసేయండి. ఇలాగే అన్నీ చేయండి. ఆ తర్వాత నూనె వేడి చేసి ఎర్రగా అయ్యే వరకు వేయించండి. సాస్ లేదా చట్నీతో వేడివేడిగా వడ్డించండి.

 

పొటాటో చిప్స్ చీజ్‌బౌల్
కావల్సినవి: చిప్స్ 1ప్యాకెట్, తురిమిన ఛీజ్2 పెద్ద చెమ్చాలు, తరిగిన ఉల్లిపాయలు2, తరిగిన సిమ్లామిర్చి1పెద్దచెమ్చా, టమేటా సాస్ ఒక పెద్ద చెమ్చా, పిజ్జా సీజనింగ్ ఒక చిన్న చెమ్చా.
తయారీ విధానం: ఒకబౌల్‌లో చిప్స్ వేసి పైనుంచి చీజ్, ఉల్లి, సిమ్లా మిర్చి వేయండి. తర్వాత టొమేటో సాస్ సీజనింగ్ వేసి ముందుగానే వేడిగా ఉన్న ఓవెన్‌లో చీజ్ కరిగేదాకా ఉంచి, ఆపై సర్వ్ చేయండి.

 

బనానా కచోరి
కావలసినవి: మైదా 1కప్పు, వెన్న1 పెద్ద చెమ్చా, అరటికాయ1,కారంపొడి1/2 చిన్న చెమ్చా, ధనియాల పొడి1/2 చిన్న చెమ్చా, గరం మసాలా 1/4 చిన్న చెమ్చా, మామిడిపొడి 1/4చిన్న చెమ్చా, నెయ్యి1/2 పెద్దచెమ్చా, నూనె వేయించేందుకు, ఉప్పు తగినంత.
తయారీ విధానం: పచ్చి అరటికాయను ఉడికించండి. తర్వాత తొక్క తీసి మ్యాష్ చేయండి. మైదాలో వెన్న, కొంచెం ఉప్పు వేసి కలపండి. కడాయి వేడి చేసి కొంచెం నెయ్యి వేడి చేయండి. అన్ని మసాలాలు, అరటి వేయించండి. కలిపిన పిండిని ముద్దలు చేసి మృదువుగా ఒత్తి పచ్చి అరటి మసాలాలు నింపి మూసేసి, మళ్లీ ఒత్తాక వేసి నూనెలో వేయించండి.

 

పొటాటో పాన్ కేక్
కావలసినవి:పచ్చి బంగాళాదుంపలు2, ఉడికిన బంగాళాదుంప1, తరిగిన ఉల్లి1, తరిగిన పచ్చిమిర్చి1లేదా 2, మైదా1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/4 చిన్న చెమ్చా, నూనె 2౩ పెద్ద చెమ్చాలు, ఉప్పుతగినంత.

తయారీ విధానం: పచ్చి బంగాళాదుంపలు తొక్క తీసి తురమాలి. ఉడికించిన బంగాళాదుంపను మ్యాష్ చేయాలి. ఒక బౌల్‌లో ఆలూగుజ్జు, మైదా, మిర్చి, ఉల్లి వేసి నీళ్లు పోసి చిక్కటి పిండిలా చేయండి. ఇందులో ఉప్పు, బేకింగ్ పౌడర్‌ను వేసి బాగా కలపాలి. వేడిపెనంపై ఒక పెద్ద చెమ్చా పిండి వేసి వెడల్పుగా చేయండి. రెండువైపులా నూనెతో వేయించాలి. దీన్ని సాస్‌తో వేడివేడిగా వడ్డించండి.

Indian evening snacks recipes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వెరైటీ స్నాక్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: