‘ఐకాన్’లో దిశా?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ చిత్రం కాగా నెక్ట్స్ రెండు సినిమాలు కూడా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ చిత్రం ఉంది. అయితే ఈ రెండు సినిమాలలో ఏది ముందుగా సెట్స్ మీదకు వెళ్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే ‘ఐకాన్’ ప్రీ […] The post ‘ఐకాన్’లో దిశా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ చిత్రం కాగా నెక్ట్స్ రెండు సినిమాలు కూడా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ చిత్రం ఉంది. అయితే ఈ రెండు సినిమాలలో ఏది ముందుగా సెట్స్ మీదకు వెళ్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే ‘ఐకాన్’ ప్రీ ప్రొడక్షన్ మాత్రం జోరుగా సాగుతోందని సమాచారం.

వేణు శ్రీరామ్ చెప్పిన కథ అల్లు అర్జున్‌కు విపరీతంగా నచ్చిందనే టాక్ ఉంది. కథలో యూనివర్సల్ అప్పీల్ ఉండడంతో ప్యాన్ ఇండియా ఫిలింగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారట. అందుకే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఒక క్రేజీ బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మొదట బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌ను సంప్రదించారని.. అయితే ఆమె ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని సమాచారం.

ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండడంతో ఈ ఆఫర్‌ను స్వీకరించలేదట. దీంతో మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో దిల్‌రాజు ఉన్నారట. ఈ సినిమా ఆఫర్‌ను దిశా ఒప్పుకోవడం ఖాయమేనని అంటున్నారు. ఇక అలియా క్రేజ్ ఒక రకమైనదైతే.. దిశా క్రేజ్ మరో రకమైనది. గ్లామర్‌తో దిశా మైమరపించగలదు.

Disha Pathani in Allu Arjun’s icon film

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘ఐకాన్’లో దిశా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: