మాట నిలబెట్టుకున్న ఎంఎల్ఎ రోజా

అమరావతి : నగరి ఎంఎల్ఎ, ప్రముఖ నటి రోజా తెలంగాణ సిఎం కెసిఆర్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల కెసిఆర్ తమిళనాడులోని అత్తి వరదరాజస్వామి దర్శనానికి వెళుతూ నగరిలోని రోజా ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో కెసిఆర్, రోజాల మధ్య రాజకీయ పరమైన చర్చ జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లో ఎదుగుదలకు మరింతగా కృషి చేయాలని కెసిఆర్ రోజాకు సలహా ఇచ్చినట్టు ప్రచారం కూడా జరిగింది. ఓ తెలుగు టివి ఛానల్ […] The post మాట నిలబెట్టుకున్న ఎంఎల్ఎ రోజా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి : నగరి ఎంఎల్ఎ, ప్రముఖ నటి రోజా తెలంగాణ సిఎం కెసిఆర్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల కెసిఆర్ తమిళనాడులోని అత్తి వరదరాజస్వామి దర్శనానికి వెళుతూ నగరిలోని రోజా ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో కెసిఆర్, రోజాల మధ్య రాజకీయ పరమైన చర్చ జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లో ఎదుగుదలకు మరింతగా కృషి చేయాలని కెసిఆర్ రోజాకు సలహా ఇచ్చినట్టు ప్రచారం కూడా జరిగింది. ఓ తెలుగు టివి ఛానల్ లో ప్రసారమవుతున్న జబర్ధస్త్ షోకు రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో ఇటువంటి ప్రోగ్రాములకు దూరంగా ఉంటే మంచిదని రోజాకు కెసిఆర్ సూచించినట్టు సమాచారం. దీంతో రోజా జబర్ధస్త్ ప్రోగ్రామ్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వారం రోజా ప్లేస్‌లో జబర్ధస్త్ ప్రోగ్రాంలో జడ్జ్‌గా శేఖర్ మాస్టర్ కనిపించారు. జబర్ధస్త్ ప్రోగ్రాం నుంచి రోజా తప్పుకోవడంతో ఆ ప్రోగ్రాంకు పెద్ద దెబ్బేనన్న అభిప్రాయం రోజా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. జబర్ధస్త్ ప్రోగ్రాం నుంచి తప్పుకున్నట్టు వస్తున్న వార్తలపై రోజా మాత్రం స్పందించలేదు.

Roja Dropped Out Of Jabardasth Program

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాట నిలబెట్టుకున్న ఎంఎల్ఎ రోజా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: