కేశవగిరిలో దారుణం…చెల్లెలిని బంధించి అక్కపై అత్యాచారం

  హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పరిధిలోని కేశవగిరిలో దారుణం జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఓ బాలుడు(17), బాలిక(16)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిని పక్క గదిలో బంధించి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కేశవగిరిలో నివసించే ఓ కుటుంబంలోని తల్లి, తన కుమారులను తీసుకొని మంగళవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు కూతుళ్లు ఇంటి వద్దే […] The post కేశవగిరిలో దారుణం… చెల్లెలిని బంధించి అక్కపై అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పరిధిలోని కేశవగిరిలో దారుణం జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఓ బాలుడు(17), బాలిక(16)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిని పక్క గదిలో బంధించి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. కేశవగిరిలో నివసించే ఓ కుటుంబంలోని తల్లి, తన కుమారులను తీసుకొని మంగళవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు కూతుళ్లు ఇంటి వద్దే ఉన్నారు. ఇది గమనించిన ఓ బాలుడు.. ఇంట్లోకి ప్రవేశించి… ఇద్దరమ్మాయిల్లో పెద్దమ్మాయిని బలవంతంగా పడక గదిలోకి లాక్కెళ్లాడు. అడ్డుకోబోయిన ఆమె చెల్లెలిని పక్క గదిలో బంధించి, అక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు ఇంటికొచ్చాక జరిగిన ఘటన గురించి బాలిక వారితో చెప్పడంతో బాధితురాలి తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద బాలుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం జువైనల్ హోమ్‌కు తరలించారు.

A boy Raped minor girl in Keshavagiri, Hyd

The post కేశవగిరిలో దారుణం… చెల్లెలిని బంధించి అక్కపై అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: