భారత్‌తో చర్చల్లేవ్

మా శాంతి ప్రయత్నాలన్నీ విఫలం ఇప్పుడు రెండు అణ్వస్త్ర దేశాలు తలపడొచ్చు పొరుగుదేశాల మధ్య సైనిక చర్యకు ఆస్కారం ఇండియా మోసం చేస్తే ఏమైనా జరగవచ్చు : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఇస్లామాబాద్/న్యూయార్క్: తాము శాంతికోసం చేసే ప్రయత్నాలను భారతదేశం పదేపదే వమ్ము చేస్తోంది కనుక ఇంక ఆ దేశంతో చర్చల ప్రసక్తి లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ గురువారం స్పష్టం చేశారు. ఈ ఆరోపణను భారతదేశం తిరస్కరించింది. ఉగ్రవాద సంస్థలపై విశ్వసనీయమైన చర్య తీసుకుంటేనే పాకిస్థాన్‌తో […] The post భారత్‌తో చర్చల్లేవ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మా శాంతి ప్రయత్నాలన్నీ విఫలం
ఇప్పుడు రెండు అణ్వస్త్ర దేశాలు తలపడొచ్చు
పొరుగుదేశాల మధ్య సైనిక చర్యకు ఆస్కారం
ఇండియా మోసం చేస్తే ఏమైనా జరగవచ్చు : పాక్ ప్రధాని ఇమ్రాన్

ఇస్లామాబాద్/న్యూయార్క్: తాము శాంతికోసం చేసే ప్రయత్నాలను భారతదేశం పదేపదే వమ్ము చేస్తోంది కనుక ఇంక ఆ దేశంతో చర్చల ప్రసక్తి లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ గురువారం స్పష్టం చేశారు. ఈ ఆరోపణను భారతదేశం తిరస్కరించింది. ఉగ్రవాద సంస్థలపై విశ్వసనీయమైన చర్య తీసుకుంటేనే పాకిస్థాన్‌తో చర్చిస్తామని పదేపదే చెబుతున్నామని పేర్కొంది.
పాక్ విమర్శల దాడి
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత దేశం ఈ నెలారంభంలో రద్దు చేసిన తర్వాత ఇండియాపై పాకిస్థాన్ విమర్శల దాడిని పెంచింది. అణ్వస్త్రాలున్న రెండు పొరుగుదేశాల మధ్య సైనికచర్య జరుగుతుందేమోనని ఇమ్రాన్‌ఖాన్ ది న్యూయార్క్ టైమ్స్‌కు చెప్పారు. ‘ఇంక వారితో (భారతదేశం) మాట్లాడడంలో అర్థం లేదు. నేను అన్నివిధాలా చెప్పాను. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే… దురదృష్టవశాత్తు నేను శాంతికోసం, చర్చలకోసం చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. మేమేదో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నామని వాళ్లు అనుకుంటున్నారు. ఇంక మేం చేయగలిగిందేమీ లేదు’ అని పాకిస్థాన్ ప్రధాని తెలిపారు.

అయితే…న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ బోర్డును కలుసుకున్న అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ ష్రింగ్లా ఖాన్ విమర్శను తిరస్కరించారు. ‘మేం శాంతికోసం చొరవ తీసుకున్న ప్రతిసారీ మాకే ఎదురు దెబ్బ తగిలింది. ఇది మా అనుభవం. ఉగ్రవాదంపై పోరుకు పాకిస్థాన్ … విశ్వసనీయమైన, తిరుగులేని, పరిశీలనాత్మకమైన చర్య తీసుకుంటుందని మేమనుకున్నాం’ అని ష్రింగ్లా విమర్శించారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని, అందువల్లే జమ్మూకశ్మీర్, దేశంలో ఇతర ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని భారతదేశం ఆరోపిస్తోంది. 2016 జనవరిలో పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థ పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై దాడి చేసిన తర్వాత ఇండియా ఆ దేశానికి దూరంగా ఉంటోంది. చర్చలు, ఉగ్రవాదం చెట్టాపట్టాలేసుకుని సాగవని విశ్వసించింది.

Pak Minister Imran Khan Says No More Talks With India

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భారత్‌తో చర్చల్లేవ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: