హీరో రాజ్‌తరుణ్ కేసులో మరో ట్విస్ట్

మనతెలంగాణ/హైదరాబాద్ : సినీనటుడు రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కేసులో గురువారం మరో కీలక మలుపు చోటుచేసుకుంది. కారు ఆక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ వీడియోలు తీసిన కాస్టూమ్ డిజైనర్ కార్తిక్..తనని వీడియోలు తీసేయాలని బ్లాక్ మెయిల్ చేశారంటూ మీడియా ముందుకు వచ్చాడు. కార్తీక్ చెపుతున్న దాంట్లో వాస్తవం లేదని.. రాజ్ తరుణ్ వీడియోలతో తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నటుడు రాజారవీంద్ర మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు […] The post హీరో రాజ్‌తరుణ్ కేసులో మరో ట్విస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్ : సినీనటుడు రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కేసులో గురువారం మరో కీలక మలుపు చోటుచేసుకుంది. కారు ఆక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ వీడియోలు తీసిన కాస్టూమ్ డిజైనర్ కార్తిక్..తనని వీడియోలు తీసేయాలని బ్లాక్ మెయిల్ చేశారంటూ మీడియా ముందుకు వచ్చాడు. కార్తీక్ చెపుతున్న దాంట్లో వాస్తవం లేదని.. రాజ్ తరుణ్ వీడియోలతో తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నటుడు రాజారవీంద్ర మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు తీసేస్తానని కార్తిక్ చెప్పాడని రాజా రవీంద్ర పీఎస్ లో కార్తిక్ పై ఫిర్యాదు చేశాడు. రాజ్ తరుణ్ కెరియర్‌కు ఇబ్బందవుతుందని రూ.3 లక్షలు ఇస్తామన్న ఒప్పుకోలేదని రాజారవీంద్ర అన్నా రు. మీరు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే మీడియాకు వీడియోలు లీక్ చేస్తానని కార్తిక్ బెదిరించాడు. దీంతో అంత డబ్బులు ఇవ్వలేకే మేము సైలెంట్ అయ్యాము. న్యాయ పరం గా ముందుకెళ్తామని రాజారవీంద్ర తెలిపారు. ఆగస్ట్ 18న రాత్రి రాజ్ తరుణ్ నడిపిస్తున్న కారు అతివేగంగా వచ్చి ఖాళీ ప్లాటు గోడను ఢీ కొట్టి నిలిచిపోయిన విషయం తెలిసిందే.

New Twist In Actor Raj Tarun car accident case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హీరో రాజ్‌తరుణ్ కేసులో మరో ట్విస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: