అభయారణ్యం అభివృద్ధికి నిధులు

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : నగర వాసులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు వినోదాన్ని పంచేలా అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న కీసరగుట్ట అభయారణ్యం అభివృద్దికి నిధులు మంజూరయ్యాయి. కీసరగుట్టలోని 2,042 ఎకరాల అట వీ భూములను దత్తత తీసుకున్న టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ మేరకు తన ఎంపీ నిధుల నుంచి మొదటి విడతలో రూ.2.97 కోట్లు కేటాయించారు. ఈనెల 29న కీసరగుట్టలో పనులను ఎంపి సంతోష్ స్వయంగా […] The post అభయారణ్యం అభివృద్ధికి నిధులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : నగర వాసులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు వినోదాన్ని పంచేలా అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న కీసరగుట్ట అభయారణ్యం అభివృద్దికి నిధులు మంజూరయ్యాయి. కీసరగుట్టలోని 2,042 ఎకరాల అట వీ భూములను దత్తత తీసుకున్న టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ మేరకు తన ఎంపీ నిధుల నుంచి మొదటి విడతలో రూ.2.97 కోట్లు కేటాయించారు. ఈనెల 29న కీసరగుట్టలో పనులను ఎంపి సంతోష్ స్వయంగా ప్రారంభించనున్నారు. మొక్కలు నాటడం ద్వారా అభయారణ్యం అభివృద్ధి పనులు ప్రారంభం కానుండగా ఆదే రోజు కీసరగుట్ట అటవీ భూమిలో లక్ష మొక్కలు నాటేలా కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి కార్యక్రమ నిర్వహణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కీసరగుట్టను సందర్శించిన ముఖ్యమంత్రి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ల అభివృద్ధి కార్యక్రమంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రతిపాధనలపై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్ యంవి రెడ్డి అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి కీసరగుట్ట అభయారణ్యం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మొదటి విడతలో కీసరలో అర్బన్ పార్క్ అభివృద్ధి
కెటిఆర్ ఇచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్ ’ పిలుపు సూర్తితో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ల అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములవుతూ కీసరగుట్ట అభయారణ్యం అభివృద్ధికి ఎంపి సంతోష్ రూ.2.97 కోట్లు కేటాయించగా, మరింత మంది ప్రముఖులు ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. 2042 ఎకరాల అటవీ భూములను కుటుంబ సభ్యులతో సహా సేదతీరే ప్రాంతంగా తీర్చిదిద్ది, చిన్నారుల్లో పర్యావరణం, అటవీ, జీవవైవిధ్యం ప్రాధాన్యతలపై అవగాహన కల్పించేలా అభివృద్ధి చేయనున్నారు. మొదటి విడతలో కీసరలోని పెద్దమ్మ చెరువుతో పాటు దాని ఎదురుగా గుట్టలతో కూడిన అటవీ ప్రాంతాన్ని అర్బన్ పార్క్‌గా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

అటవీ శాఖ ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచ ఉన్నప్పటికి కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని ఎంపి సంతోష్ దత్తత తీసుకోవడంతో ప్రణాళికలు మార్చాల్సి వచ్చింది. ఇందులో భాగంగా కీసర ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్దమ్మ చెరువును అన్ని విధాల అభివృద్ధి చేయనున్నారు. చెరువుకు తూర్పు దిక్కున ఉన్న 105 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నారపల్లి, మేడిపల్లి ప్రాంతాలలో చేపట్టిన నందన వనాల తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అటవీ ప్రాంతం పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే ప్రజలకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 105 ఎకరాలలో చుట్టూ కంచె నిర్మాణంతో పాటు పార్కు అభివృద్ధి, వాకింగ్, సైక్లింగ్, సిట్టింగ్ బేంచీలు, యోగా షెడ్, రెస్టారెంట్ నిర్మాణాలు చేపడతారు.

funds granted for development of Keesaragutta Forest

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అభయారణ్యం అభివృద్ధికి నిధులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: